ఎమ్మెల్యేకి, ప్రజలకి నూతన సంవత్సర శుభాకాంక్షలు
- వీరమల్లు శ్రీను
కందుకూరు డిసెంబర్ 31 BSBNEWS
2023లో ఎన్నో ఒడిదుడుకులను, కష్టనష్టాలను ఎదుర్కొని, సుఖ సంతోషాల కోసం 2024 వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా మండలంలోని పలుకూరు గ్రామ ప్రజలకు, నాయకులకు పలుకురు సర్పంచ్ వీరమల్లు శ్రీను నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత కాలానికి స్వస్తి చెబుతూ కొత్త కాలానికి ఆహ్వానం పలకడానికి సిద్ధంగా ఉన్న ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. 2023 వ సంవత్సరంలో కందుకూరు నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కారంలో చొరవ చూపుతూ అందరి అభిమానం పొందిన కందుకూరు శాసన సభ్యులు మానుగుంట మహీధర రెడ్డికి పలుకూరు గ్రామ ప్రజలు, నాయకుల తరఫున ప్రత్యేకంగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నామన్నారు. 2024వ సంవత్సరంలో మరో కొత్త అధ్యాయాన్ని రచించటానికి వైసీపీ సంసిద్ధతమవుతుంది అని అందుకు ప్రజల సహకారం పూర్తిగా ఉందని ఆయన అన్నారు. రానున్న 2024 లో ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నానన్నారు.