జగన్ దృష్టిలో ముస్లింలంటే ఓటుబ్యాంకు మాత్రమే - ఇంటూరి నాగేశ్వరరావు

0

 జగన్ దృష్టిలో ముస్లింలంటే ఓటుబ్యాంకు మాత్రమే 


 చంద్రబాబు పథకాలు నిలిపివేయడమే పెద్దమోసం  


 కందుకూరులో ముస్లింల అభివృద్ధిపై చర్చకు సిద్ధమేనా ?


ముస్లింల ఆత్మీయ సమావేశంలో ఇంటూరి నాగేశ్వరరావు 


టిడిపిలో చేరిన పలు కుటుంబాలు 


కందుకూరు డిసెంబర్ 31 BSBNEWS


తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోనే కందుకూరు నియోజకవర్గంలో ముస్లిం మైనారిటీల అభివృద్ధి జరిగిందన్నది అక్షరసత్యమని తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు పేర్కొన్నారు. పట్టణంలోని 18వ వార్డు, ఉర్దూస్కూల్ వద్ద ముస్లింలతో నాగేశ్వరరావు ఆత్మీయ సమావేశం ఏర్పాటుచేశారు. ముస్లిం సోదర సోదరీమణులు అధిక సంఖ్యలో హాజరై, తెలుగుదేశం పార్టీకి మద్దతు తెలిపారు. ముఖ్యంగా యువకులు ఎంత ఉత్సాహంతో నాగేశ్వరరావుకి ఘన స్వాగతం పలికి అభిమానాన్ని చాటుకున్నారు. ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ గత తెలుగుదేశం ప్రభుత్వంలో వందల మందికి సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందించిన విషయాన్ని గుర్తు చేశారు. మైనారిటీ కార్పొరేషన్ రుణాలు, విదేశీ విద్య, దుల్హన్, రంజాన్ తోఫా, ఇమామ్ మౌజం లకు జీతాలు, ఇలా అనేక పథకాలు పేదల కుటుంబాల్లో వెలుగులు నింపాయన్నారు. ముస్లిం కుటుంబాల్లో అర్హులైన వారికి జిప్లస్ త్రీ అపార్ట్మెంట్లలో అధిక సంఖ్యలో ఇల్లు కేటాయించామని ఆయన గుర్తుచేశారు. గత ప్రభుత్వంలో షాదీఖానా నిర్మాణం కోసం స్థలం కేటాయించి, నిధులు కూడా మంజూరు చేసినట్లు ఆయన తెలిపారు. వైసీపీ ప్రభుత్వం రాగానే ఆ విషయాన్ని పూర్తిగా పక్కన పెట్టారని విమర్శించారు. ముస్లింల మీద నిజంగా ప్రేమ ఉంటే, షాదీఖానా నిర్మాణం ఎందుకు మొదలు పెట్టించలేదని ఎమ్మెల్యే మహీధర్ రెడ్డిని ఆయన సూటిగా ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డికి, స్థానిక ఎమ్మెల్యేకు ముస్లింలు కేవలం ఓటుబ్యాంకుగా మాత్రమే కనిపిస్తున్నారని విమర్శించారు. గత ఎన్నికలకు ముందు అమలవుతున్న పథకాలు నిలిపివేసి ముస్లిం సమాజాన్ని నిలువునా మోసం చేశారని అన్నారు. కందుకూరు నియోజకవర్గంలో ఎవరి హయాంలో ముస్లింలకు మేలు జరిగిందో చర్చకు సిద్ధమేనా అని ఆయన ప్రశ్నించారు. 


 టిడిపిలో చేరిన పలు కుటుంబాలు 


ఈ సందర్భంగా ఇంటూరి నాగేశ్వరరావు సమక్షంలో షేక్ హాజీ బాషా, షేక్ షాజహాన్, ఇంకా పలు కుటుంబాల వారు తెలుగుదేశం పార్టీలో చేరారు.


ముస్లిం సమాజం ఇకనైనా జగన్ దుర్మార్గాలను, మోసాలను గమనించి రాబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపుకు సహకరించాలని ఆయన కోరారు. నియోజకవర్గంలో ముస్లింలకు తాను ఆత్మీయ బంధువులా ఉంటానని, ఈసారి ఎన్నికల్లో తనకు మద్దతు ఇచ్చి గెలిపించాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షుడు దామా మల్లేశ్వరరావు, వార్డు అధ్యక్షుడు నగర జయకృష్ణ, కందుకూరు మండల పార్టీ అధ్యక్షులు నార్నే రోశయ్య, గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జెనిగర్ల నాగరాజు, వార్డు నాయకులు, మాజీ కౌన్సిలర్ ఈదర రవణమ్మ, జియావుద్దీన్, ఫాజిల్, రావి జాలయ్య, చంటి, నాగరాజు నాయకులు షేక్ రఫీ, చిలకపాటి మధు, బెజవాడ ప్రసాద్, షేక్ మున్నా, షేక్ సలాం, షేక్ రూబీ, చుండూరి శీను, సవిడిపోయిన వెంకటకృష్ణ, పులి నాగరాజు, షేక్ ఫిరోజ్, ముప్పవరపు వేణు, గుమ్మా శివ, మచ్చా మనోహర్, ఇతర నాయకులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)