ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు
--కోటపాటి జనార్దన్ రావు
కందుకూరు డిసెంబర్ 31 BSBNEWS
2024 నూతన సంవత్సరం ప్రజల జీవితాల్లో వెలుగులు నింపాలని, సరికొత్త విజయాలను అందించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు పారిశ్రామిక వేత్త కోటపాటి జనార్దన్ రావు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ఆయన ప్రజలకు, టిడిపి నాయకులకు, కార్యకర్తలకు నూతన సంవత్సరం శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గత తప్పులను సరిదిద్దుకోవడానికి, నూతన లక్ష్యాన్ని సాధించడానికి కొత్త సంవత్సరంతో మరో అవకాశం వచ్చిందన్నారు. కొత్త ఏడాదిలో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో వర్ధిల్లాలని అన్నారు. అవధుల్లేని సంతోషంతో 2024 ప్రజల జీవితాల్లో గుర్తుండిపోవాలన్నారు. గతేడాదిలో జరిగిన మంచి కన్నా మరింత మేలు కలగాలని ఆయన ఆకాంక్షించారు. పాత చేదును మరచి కొత్త సంవత్సరానికి స్వాగతం పలికి విజయం వైపు అడుగులు వేద్దామని పిలుపునిచ్చారు.