నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన ఇంటూరి
కందుకూరు డిసెంబర్ 31 BSBNEWS
తెలుగుదేశం పార్టీ కందుకూరు నియోజకవర్గ ఇన్చార్జ్ ఇంటూరి నాగేశ్వరరావు నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు 2024 నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత సంవత్సరానికి వీడ్కోలు చెప్పి, నూతన సంవత్సరానికి హృదయపూర్వక స్వాగతం పలుకుదాం అన్నారు. కొత్త ఏడాదిలో అందరి కలలు సాకారం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అని తెలిపారు. నూతన సంవత్సరం ప్రతి ఒక్కరికీ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలు ఇవ్వాలని ఆకాంక్షించారు.దేశ విదేశాల్లో ఉన్న మన తెలుగు వారందరికీ సైతం నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.