అధ్యాపకుడికి డాక్టరేట్
కందుకూరు డిసెంబర్ 31 BSBNEWS
టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చరిత్ర అధ్యాపకుడిగా పనిచేస్తున్న డి రామాంజనేయులు కు, శ్రీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం డాక్టరేట్ అందజేసింది. రామాంజ నేయులు క్విట్ ఇండియా ఉద్యమం యొక్క చారిత్రక అధ్యయనం, నూతన దృక్పథంతో పరిశీలన అను అంశం మీద చేసిన పరిశోధనకు డాక్టరేట్ అందజేశారు . ఈ పరిశోధన ప్రొఫెసర్ కే మల్లికా ర్జున రెడ్డి పర్యవేక్షణలో జరిగింది. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం. రవి కుమార్, అధ్యాపక బృందం రామాంజనేయులును అభినందించారు. టి ఆర్ ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మొత్తం 25 మంది అధ్యా పకులు డాక్టరేట్ డిగ్రీలు కలిగి ఉన్నారని, వారి యొక్క అనుభవాన్ని విద్యార్థినీ విద్యార్థులు వినియోగించు కోవాలని ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ కందుకూరు పరిసర ప్రాంత విద్యార్థులను కోరారు.