రామాయపట్నం పోర్టు నిర్వాసితుల ఆందోళనకు మద్దతుగా సోమవారం నిరాహార దీక్షలో కూర్చుంటా
సంచలన ప్రకటన చేసిన అధికార పార్టీ ఎమ్మెల్యే మానుగుంట మహీధర్ రెడ్డి..
BSBNEWS
రాష్ట్రాభివృద్దికి దోహదపడే రామాయపట్నం పోర్టు కోసం భూములను త్యాగం చేసిన మత్స్యకారులకు న్యాయం జరిగేంతవరకు వారికి అండగా ఉంటా.. ఎంతదాక అయినా పోరాడతా.. నిర్వాసితులకు న్యాయం జరగకపోతే పోర్టు కోసం ఇచ్చిన భూములను మత్స్యకారులు తిరిగి స్వాధీనం చేసుకోవాల్సి వస్తుంది. అధికారులకు అల్టిమేటం ఇచ్చిన ఎమ్మెల్యే మహీధర్ రెడ్డి. నిర్వాసితులకు మద్దతుగా ఆదివారం నుండి పోర్టు కార్యాలయం వద్ద ప్రారంభం కానున్న నిరాహారదీక్షలు. సంఘీభావంగా అన్ని గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో నిరాహార దీక్షలో పాల్గొనాలని మహీధర్ రెడ్డి పిలుపు.