సామాజిక కోణం ఆవిష్కరించిన కావ్యం పాలపిట్ట - దామా వెంకటేశ్వర్లు

0




 కందుకూరు ఫిబ్రవరి 19 BSBNEWS


:-


జాషువా సాహిత్య సాంస్కృతిక సంస్థ అధ్యక్షుడు ముప్పవరపు కిషోర్ రాసిన పాలపిట్ట ధీర్ఘ కావ్యం కందుకూరు నియోజకవర్గం సామాజిక, సాంస్కృతిక, రాజకీయ, సాహిత్య, ఆధ్యాత్మిక వైభవాన్ని వివరిస్తుంది అని ప్రముఖ సాహిత్యాభిలాషి దామా వెంకటేశ్వర్లు తెలిపారు. స్థానిక కోటారెడ్డి భవనం ( సిపిఐ ఆఫీస్) వద్ద పాలపిట్ట పోస్టర్ ను దామా వెంకటేశ్వర్లు చేతుల మీదుగా ఆవిష్కరణ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ప్రాంత కవులను, రచయితలను ప్రోత్సహించడం ద్వారా ప్రజలకు చారిత్రక నేపథ్యాన్ని అందించడం జరుగుతుంది అని అన్నారు. అందరూ ఇటువంటి సాహిత్య కార్యక్రమాలకు సహకరించాలని కోరారు. ఉపాసకులు గాండ్లహరిప్రసాద్ మాట్లాడుతూ కావ్యం రాసేటప్పుడు ఏ పక్షం వహించి మాట్లాడుతున్నామన్నది కవి సృహ కలిగి వుండాలి అని అన్నారు. ఈ కోవలోనే ముప్పవరపు కిషోర్ రచించిన పాలపిట్ట దీర్ఘ కావ్యం ద్వారా సామాజిక కోణం ఆవిష్కరిస్తుంది అని అన్నారు. జాషువా సాహిత్య సాంస్కృతిక సంస్థ కార్యదర్శి చనమాల కోటేశ్వరరావు మాట్లాడుతూ మా సంస్థ అధ్యక్షుడు ముప్పవరపు కిషోర్ చే విరచించిన పాలపిట్ట దీర్ఘ కావ్యం శాసనసభ్యులు మానుగుంట మహిధర‌‌రెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరణ కార్యక్రమం ఈనెల 24వ తేదీ శనివారం సాయంత్రం గం.4-30 నిమిషాలకు స్థానిక బాలుర ఉన్నత పాఠశాల నందు జరుగుతుందన్నారు. ఎమ్మెల్యే తో పాటు ప్రముఖ సాహితీ విశ్లేషకులు బీరం సుందరరావు, మాదిగ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ కొమ్మూరి కనకారావు లు పాల్గొంటారన్నారు. ఈసందర్భంగా కవులు, కళాకారులు, రచయితలు, సమాజం హితం కోసం పనిచేస్తున్న ప్రజాస్వామిక వాదులు,సాహిత్యవేత్తలు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు, మేధావులు ప్రజలు అందరూ పాల్గొనాలని కోరారు. ఈకార్యక్రమంలో సిపిఐ కార్యదర్శి బూసి.సురేష్, రిటైర్డ్ ఎ.ఈ సింగయ్య, బి యస్ పి నియోజకవర్గ ఇన్చార్జి బెజవాడ కొండయ్య, సీనియర్ జర్నలిస్టు ఉప్పుటూరి మాధవరావు, స్కందపురి పెయింటింగ్ అసోసియేషన్ కార్యదర్శి కంకణాల బ్రహ్మయ్య, కృష్ణ బలిజ సంఘం జిల్లా అధ్యక్షుడు పాశం కొండయ్య, యువత నాయకులు షేక్ మహబూబ్ బాషా, అంబేద్కర్ యువజన నాయకులు గంటేనపల్లి సూర్య నారాయణ, మనోహర్,దార్ల సుబ్బారావు, బహుజన నాయకులు ముతకాని లక్ష్మి నారాయణ, పుర ప్రముఖులు దామా శింగయ్య, కె.వెంకటేశ్వర్లు, యస్సీ,యస్టీ రైతు కూలీ సంఘం డివిజన్ అధ్యక్షుడు పంది నరశింహం , న్యాయవాది ముట్లూరి రమేష్ , దండు రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)