వారి కోసం ఏమైనా అందిస్తా....సర్పంచ్ వీరమల్లు
నిరుపేద కుటుంబాల పిల్లల ఉన్నత చదువులకు అవసరమైనవి కావాలని నా దృష్టికి తీసుకువస్తే ఏమైనా అందిస్తానని పలుకూరు సర్పంచ్ వీరమల్లు శ్రీను అన్నారు. పట్టణంలోని బాలికాసదనంలో విద్యార్థులకు వారి అవసరార్థం దిండ్లను పలుకూరు సర్పంచ్ వీరమల్లు శ్రీను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేదరికంతో ఇబ్బందులు పడుతూ మీ పిల్లల చదువు కొనసాగించలేని వారికి ప్రభుత్వాలు సంక్షేమ హాస్టల్లను ఏర్పాటు చేసి ఆ పిల్లల ఉన్నత చదువులకు దోహదపడుతున్నాయి అని అన్నారు. హాస్టళ్లకు దాతర సహాయం ఎంతో అవసరం అవుతుందని ఉన్నత స్థాయిలో ఉండి వారు ఏర్పాటు చేసుకునే అనేక కార్యక్రమాలకు వృధా ఖర్చులు చేయకుండా పేద విద్యార్థులకు అవసరమైనటువంటి వసతులను కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ కోటేశ్వరమ్మ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.