ప్రకాశం జిల్లా..ONG-- BSBNEWS
బదిలీపై వెళ్తున్న ప్రకాశం జిల్లా ఎస్పీమల్లికా గర్గ్ ఐపీఎస్ కి ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికిన గుంటూరు రేంజ్ IGP పాలరాజు,IPS.
పొలీసు అధికారులు సమర్థవంతమైన విధులతో ప్రజలకు ఉత్తమ సేవలందిస్తూ పోలీసు శాఖ ప్రతిష్ట పెంచాలి: గుంటూరు రేంజ్ ఐజీ.

ప్రకాశం జిల్లా, రెండు సంవత్సరాల 7 నేలల పాటు వినూత్న కార్యక్రమాలతో, సిబ్బంది సంక్షేమంలో జిల్లాలో తనదైన ముద్ర వేసుకొని బదిలీపై తిరుపతి జిల్లాకు ఎస్పీగా బదిలీ అయిన సందర్భంగా ఆదివారం ఒంగోలు, జిల్లా పోలీస్ కార్యాలయంలో గుంటూరు రేంజ్ IGP పాలరాజు,IPS, జిల్లా కలెక్టర్, ఏ.ఎస్.దినేష్ కుమార్, బాపట్ల జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్, ఐపియస్, జిల్లా ఎస్పీ కుటుంబం సభ్యులు, మాజీ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఐ.వి.వెంకటేశ్వర్లు, జిల్లా పోలీస్ అధికారులు ఎస్పీని శాలువా, పూలమాలలతో సత్కరించి, జ్ఞాపికలను అందజేసి ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ సందర్భంగా గుంటూరు రేంజ్ IGP పాలరాజు,IPS, మాట్లాడుతూ ప్రతి అధికారికి సాధారణంగా బదిలీలు సర్వసాధారణమని అయితే ప్రకాశం జిల్లా ఎస్పీగా విశిష్టమైన సేవలను అందించి ఎన్నో కీలకమైనటువంటి కేసులను చాకచక్యంగా చేధించారన్నారు. అలాగే టంగుటూరు,చీమకుర్తిలలో జరిగిన జంట హత్యల కేసులను చేదించి నిందితులను అరెస్టు చేశారని, సంచలనం కలిగించిన కుమార్తెను చంపిన తండ్రి హత్య కేసులో ఎస్పీ విశిష్ట విధుల ద్వారా నిందితులను త్వరితగతిన అరెస్టు చేశారన్నారు. రోడ్డు ప్రమాదాలు 25% తగ్గించారని, శిక్షల శాతం పెంచారని, శాంతి భద్రత మరియు నేరాల నియంత్రణలో సమర్ధవంతంగా విధులు నిర్వర్తించారని జిల్లా ఎస్పీని కొనియాడారు. ప్రకాశం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్పీగా రావడమే జిల్లాలో ఉన్న శాంతిభద్రతల అంశాలు, సున్నితమైన విషయాలు, పోలీసింగ్ లో ఉన్న లోటుపాట్లను సమగ్రంగా తెలుసుకొని పోలీస్ శాఖలో తలెత్తే పలు రకాల ఇష్యూస్ ను పరిష్కరిస్తూ వచ్చారని, జిల్లాలో పెద్ద పెద్ద కార్యక్రమాల సమయంలో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసి వాటిని విజయవంతం చేయడంలో చాలా కృషి చేశారని, ప్రకృతి విపత్తుల వచ్చినప్పుడు రిస్క్యూ, పునరావాస చర్యలను ప్రణాళిక బద్ధంగా ఏర్పాటు చేసి ఎలాంటి నష్టం వాటిల్లకుండా అన్ని శాఖల సమన్వయంతో సమర్థవంతంగా పనిచేశారని, జిల్లా పోలీస్ శాఖలో వినూత్న ఆలోచనలతో చాలా కార్యక్రమాలు చేపట్టారని, బదిలీపై వెళ్తున్న తిరుపతిలో కూడా మెరుగైన పోలీసింగ్ సేవలు అందిస్తారని అన్నారు. బాపట్ల జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంకి పోలీస్ ఆఫీసర్ గా వచ్చిన 6 నెలల వ్యవధిలోనే ఒక జిల్లాకి ఎస్పీగా అవడమే కాకుండా రాష్ట్రంలోనే ఉత్తమ పోలీసింగ్ సేవలు అందిస్తున్న జిల్లాల్లో ప్రకాశం జిల్లాను ముందు వరుసలో ఉంచడం ఎస్పీ గారి హార్డ్ వర్క్, కమిట్మెంట్, గొప్ప పరిపాలన దక్షతకు నిదర్శనమని కొనియాడారు. జిల్లాకు మహిళా ఎస్పీగా వచ్చినప్పుడు నుండి ఒక సవాలుగా తీసుకొని పోలీస్ శాఖలో ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా, లోతుగా విశ్లేషించి ఒక సిస్టమేటిగ్గా చర్యలు తీసుకుంటారని, ఇలాంటి సమస్యనైనా సమర్థవంతంగా ఎదుర్కొని పరిష్కరిస్తారని అన్నారు. విధి నిర్వహణలో ఎక్కువగా నిమగ్నమైనప్పటికీ, కుటుంబ జీవితానికి తగిన సమయం కేటాయిస్తారని, రెండు చక్కగా బ్యాలెన్స్ చేస్తారని తెలిపారు.ప్రకాశం జిల్లా నుండి విభిన్న పరిస్థితులు ఉండే తిరుపతి జిల్లాకు బదిలీపై వెళ్తున్న ఎస్పీ గారు అక్కడ కూడా తనదైన శైలిలో ఉత్తమ పోలీసు సేవలు అందిస్తారని ధీమా వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రకాశం జిల్లా ఎస్పీ గారు మాట్లాడుతూ ఈ రెండున్నర సంవత్సరాల 7 నెలల కాలంలో చేపట్టిన ప్రతి కార్యక్రమానికి పోలీస్ అధికారులు, సిబ్బంది అందించిన సహకారం అభినందనీయమని, బదిలీల్లో భాగంగా ప్రకాశం జిల్లా నుండి బదిలీ అవుతున్నప్పటికీ మీ యొక్క సేవలను ఎన్నడు మరువలేనని, జిల్లాలో వినూత్న కార్యక్రమాలు చేపట్టాలంటే అది కేవలం నా ఒక్కడి కృషి కాదని, మనం అందరం కలిసికట్టుగా పనిచేసినందు వలన జిల్లాకు అవార్డులు అందుకోవటం సాధ్యమైందని, దీనికి హోంగార్డు స్థాయి నుంచి అడిషనల్ ఎస్పీ వరకు ప్రతి ఒక్కరికి పేరు పేరునా ధన్యవాదాలు తెలియచేసినారు. లా అండ్ ఆర్డర్ సిబ్బంది, ఆర్మ్ డ్ రిజర్వ్ పోలీస్ అధికారులు,సిబ్బంది అనునిత్యం రహదారులపై ఉండి శాంతిభద్రతలను పరిరక్షించడంలో పోలీస్ అధికారులు మరియు సిబ్బంది ప్రధాన భూమిక పోషించారని, పోలీస్ అధికారులు మరియు సిబ్బంది వారి వారి విధులను ఎంతో నిబద్ధతగా విధులు నిర్వర్తించారని, అందరికీ పేరుపేరునా ధన్యవాదాలు తెలియచేసినారు. జిల్లాలో శాంతిభద్రతల పరిరక్షణలో, పరిపాలనలో సహాయసహకారాలు అందించిన జిల్లా అధికారులకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. సాధారణ బదిలీల్లో భాగంగా జిల్లాలో బదిలీ అయిన పోలీస్ అధికారులను శాలువా సత్కరించి, పుష్పగుచ్ఛములు, జ్ఞాపికలను జిల్లా ఎస్పీ గారు అందజేసి ఘనంగా ఆత్మీయ వీడ్కోలు పలికారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్)కె. నాగేశ్వరరావు అడిషనల్ ఎస్పీ (క్రైమ్ )ఎస్ వి. శ్రీధర్ రావు, AR అడిషనల్ ఎస్పీ అశోక్ బాబు, డిఎస్పీ లు, సీఐలు, ఆర్ ఐలు, ఎస్సైలు, తదితరులు పాల్గొన్నారు.