BSBNEWS
టిటిడి వేద పండితుల చేత ప్రత్యేక పూజలు నిర్వహించిన బుర్ర
పట్టణంలోనీ పామూరు రోడ్లో నూతనంగా ఏర్పాటుచేసిన వైఎస్ఆర్సిపి కార్యాలయం ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన ప్రత్యేక పూజ కార్యక్రమాల్లో నియోజవర్గ సమన్వయకర్త, ఎమ్మెల్యే బుర్ర మధుసూదన్ యాదవ్ దంపతులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా టిటిడి నుంచి వచ్చిన వేద పండితుల ఆధ్వర్యంలో జరిగిన పలు హోమాలు, ప్రత్యేక పూజా కార్యక్రమంలో పాల్గొని కార్యాలయంలోకి లాంఛనంగా అడుగుపెట్టారు. కార్యక్రమానికి నియోజకవర్గంలోని పలువురు పార్టీ సీనియర్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.