జువ్వలదిన్నే షిపింగ్ హార్బర్ ను సందర్శించిన ఎమ్మెల్యే రామిరెడ్డి

bsbnews
0
జువ్వలదిన్నే షిపింగ్ హార్బర్ ను సందర్శించిన ఎమ్మెల్యే రామిరెడ్డి 
BSBNEWS20.03.2024



నువ్వుల దిన్నె షిప్పింగ్ హార్బర్ ను కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మీడియా మిత్రులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ ప్రజలతో పలు సమస్యలపై చర్చించారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆధికారంలోకి వచ్చిన తరువాత కావలి నియోజకవర్గం లో మత్సకార గ్రామాలపై ప్రత్యేకంగా దృష్టి సారించిందని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. నియోజకవర్గం అభివృద్ధిపై  ఆదివారం గౌరవరం, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ మార్గ మధ్యలో  గ్రామస్తులను పలకరిస్తూ గతంలో తమ దృష్టికి తీసుకువచ్చిన సమస్యలను పరిష్కరిస్తూ ముందుకు సాగారు. గౌరవరంలో ఒకే చోట నిర్మించిన సచివాలయం ,రైతు భరోసా కేంద్రాన్ని , వైయస్సార్ విలేజ్ క్లినిక్ నీ సందర్శించారు. గ్రామ నాయకులు రైతుల తోటి మాట్లాడారు గతంలో అనేక సమస్యలు ఎదుర్కొంటుండగా కావలి ఎమ్మెల్యేగా ప్రతాప్ కుమార్ రెడ్డి వచ్చిన తరువాత సమస్యలపై ప్రత్యేక దృష్టి పెట్టించడం జరిగిందని వారు తెలియజేశారు. ప్రధానంగా విద్యుత్ సమస్యను సాగునీటి సమస్యను పరిష్కరించడంలో ఆయన చూపిన చరవపట్ల హర్షం వ్యక్తం చేశారు.  గ్రామంలో పూర్తిగా సిమెంటు రోడ్లు నిర్మించడం ఆనందగా ఉందన్నారు. స్థానిక నాయకులు శేషారెడ్డి, శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ ప్రతాప్ కుమార్ రెడ్డి లాంటి వ్యక్తి మరో మారు ఎమ్మెల్యేగా అయితే సంపూర్ణంగా అభివృద్ధి చెందుతుందని తమ అభిప్రాయంగా చెప్పారు. అనంతరం జూలదిన్నె ఫిషింగ్ హార్బర్ కూడా ఎమ్మెల్యే సందర్శించారు. అక్కడ బోటులో ఫిష్ కి వెళ్లి వచ్చిన మత్స్యకారులతో  సమస్య తీరిన విధానాన్ని ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వలసల నివారణతోపాటు మత్స్యసంపద ఎగుమతులను ప్రోత్సహించేందుకు వీలుగా ఫిషింగ్ హార్బర్ ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. జువ్వలదిన్నె వద్ద 1,250 బోట్లు నిలిపే సామర్థ్యంతో రూ.288.8 కోట్లు వెచ్చింది ఫిషింగ్ హార్బర్ నిర్మాణం చేపట్టడం  హార్బర్ అందుబాటులోకి వచ్చాక సుమారు వేల మంది మత్స్యకారులకు ప్రత్యక్షంగా వేల మందికి ఉపాధి లభించే అవకాశం ఉందని అన్నారు.సమీపంలో రామాయపట్నం పోర్టు, జువ్వల దిన్నె ఫిషింగ్ హార్బర్, అనుబంధ పరిశ్రమలు ఏర్పాటవుతుండడంతో ఈ ప్రాంతం పారిశ్రామిక కేంద్రం గా మారనుంది. రైలు, రోడ్డు, సముద్ర మార్గాలతో పాటు వాయు మార్గంలో కూడా రవాణాకు కావలి అనుకూలంగా ఉండడంతో ఈ ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామికవాడగా అభివృద్ధి చేస్తోందని 26 నెలల్లో రూ.288.8 కోట్లతో బోగోలు మండలంలో జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ నిర్మాణ పనులు పూర్తి చేయడం జరిగిందని అన్నారు.అభివృద్ధి పరంగా అన్ని అనుకూలతలున్న కావలి పట్టణం ఇప్పటికే వస్త్ర వ్యాపార రంగంలో దూసుకుపోతోందని ఈ ప్రాంతాన్ని మరింత అభివృద్ధి చేస్తే తీర ప్రాంత మత్స్యకారులు ఆర్థికాభివృద్ధి సాధిస్తారని అన్నారు. మత్స్యకారులు గత ప్రభుత్వంలో నిత్యం ఉపాధి కోసం ఎన్నో ఇబ్బందులు పడ్డారని అన్నారు. గతంలో  తమిళనాడు, కర్ణాటక, గుజరాత్, పుదుచ్చేరి, ముంబై తదితర ప్రాంతాల్లోని బోట్ల యజమానుల వద్దకు కూలీలుగా వెళ్లి పొట్టపోసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. మరోవైపు మత్స్యకార గ్రామాల్లో చాలీచాలని వసతులతో స్థానికంగా ఉండే గంగపుత్రులు అవస్థలు పడేవారని రామాయ పట్నం పోర్టు, జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్, వీటికి అనుబంధంగా ఏర్పాటయ్యే పరిశ్రమల ద్వారా కూడా ప్రత్యక్షంగా, పరోక్షంగా ద్వారా వేలాది మందికి యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభించనున్నాయని తెలిపారు . కోటఅడవి నుంచి ఆముదాలదిన్నె మీదుగా తుమ్మలపెంట రోడ్డు వరకు పది కిలోమీటర్ల మేర  తారు రోడ్డు నిర్మాణం జరిగిందంటూ మార్గమధ్యలో 10 ప్రాంతాల గ్రామస్తులు ఎమ్మెల్యే వాహనాన్ని  అపి వారి ఆనందాన్ని ఆయనతో పంచుకున్నారు  మార్గంలో ప్రయాణిస్తున్న ఆటోలు ద్విచక్ర వాహనదారులు కూడా ఎమ్మెల్యే కనిపించడంతో ఆగి ఆయనను కలిసి ఆనందాన్ని పంచుకున్నారు. గతంలో భారీ టిప్పర్లు రాకపోకల కారణంగా ఈ రోడ్డు పూర్తిగా ధ్వంసం అయిపోయిందని  వాహనాల రాకపోకల ఇబ్బందులు ఎదుర్కొనేవారుమని అతి స్వల్ప కాలంలో ఎమ్మెల్యే చోరవ చూపి ఈ రోడ్డును పూర్తి చేయించడం పట్ల ప్రశంసల వర్షం కురిపించారు.

Post a Comment

0Comments
Post a Comment (0)