వైయస్ఆర్ సీపీలో చేరిన కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం
కాపుల ఆశయాల దిశగా అడుగులు వేస్తున్నది సీఎం జగన్ మాత్రమే- ముద్రగడ
BSBNEWS
కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ముఖ్యమంత్రి జగన్‌ను ముద్రగడ పద్మనాభం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి జగన్ సమక్షంలో ముద్రగడ పద్మనాభం, ఆయన కుమారుడు గిరి వైయస్ఆర్ సీపీలో చేరారు. ఈ మేరకు సీఎం జగన్ వారికి వైయస్ఆర్ సీపీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాపు సామాజిక వర్గ అభ్యున్నతికి పాటుపడుతున్న సీఎం జగన్ కృషిని పురస్కరించుకుని కాపు నేత ముద్రగడ పద్మనాభం వైఎస్సార్‌సీపీలో చేరారు..ఈ సందర్భంగా ముద్రగడ మాట్లాడుతూ.. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో కాపు సామాజికవర్గం వైఎస్సార్‌సీపీకి మద్దతిచ్చి కాపుల ఆకాంక్షలు నెరవేరేందుకు దోహదపడాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్‌ఆర్‌సీపీ రీజనల్ కోఆర్డినేటర్ పి.వి.మిథున్ రెడ్డి, ఎమ్మెల్యేలు కురసాల కన్నబాబు (తూర్పుగోదావరి జిల్లా వైఎస్‌ఆర్‌సీపీ అధ్యక్షుడు), ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.