ఆర్ ఎస్ ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవ వేడుకలు శుక్రవారం సాయంత్రం ఘనంగా జరిగాయి.
ఈ వేడుకలకు కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు.ముందుగా బాలబాలికలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ విలువలతో కూడిన విద్యనందించే లక్ష్యంతో ఈ పాఠశాల ఉన్నత ప్రమాణాలతో ముందుకు సాగడం హర్షణీయమన్నారు. ఇందుకు కృషి చేస్తున్న బోధనా సిబ్భందిని అభినందించారు.అనంతరం వివిధ పోటీలలో విజేతలకు బహుమతులను ప్రదానం చేశారు.ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చంద్రజ్యోతి, ఆర్ఎస్ ఆర్ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పివిఎన్ రెడ్డి, పరిపాలనాధికారి ఆర్ వి రమణారెడ్డి, శ్రీశైలం బోర్డు సభ్యుడు జగదీష్ రెడ్డి, వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కార్యదర్శి కుందుర్తి శ్రీనివాసులు తదితరులు హాజరయ్యారు.