గుమ్మడి శివకృష్ణను పరామర్శించిన ఇంటూరి నాగేశ్వరరావు
BSBNEWS 19.03.2024
కందుకూరు పట్టణం 14వ వార్డులో తూర్పు యాదవ పాలెం కు చెందిన గుమ్మడి శివకృష్ణ తెలుగుదేశం పార్టీ, బిజెపి, జనసేన చిలకలూరిపేటలో జరిగిన ప్రజా గళం ఉమ్మడి బహిరంగ సభ కు వెళ్లిన సందర్భంలో ప్రమాదవశాత్తు స్వల్ప గాయాల పాలయ్యారు. విషయం తెలిసిన ఇంటూరి నాగేశ్వరరావు మంగళవారం శివకృష్ణ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆయనతో పాటు పట్టణ పార్టీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, పట్టణ ప్రధాన కార్యదర్శి ముచ్చు శ్రీను, వార్డు అధ్యక్షుడు గుమ్మడి బ్రహ్మయ్య, కాకుమాని మాల్యాద్రి మరియు ఇతర నాయకులు పాల్గొన్నారు.