దేశవ్యాప్తంగా అమల్లోకి ‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’ ఎన్నికల కోడ్ అంటే ఏమిటి? ఎందుకు?
BSBNEWS 20.03.2024
లోక్‌సభ ఎన్నికలు 2024కు నగారా మోగింది. పార్లమెంట్‌తో పాటు ఆంధ్రప్రదేశ్ సహా 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ను కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. దీంతో దేశవ్యాప్తంగా ‘మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్’ అమల్లోకి వచ్చింది. పోటీ చేసే అభ్యర్థులు, పొలిటికల్ పార్టీలు ఎన్నికల సమయంలో ఈసీ మార్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది. అభ్యర్థులు, పార్టీల ప్రచారాన్ని నియంత్రించడమే లక్ష్యంగా రూపొందించిన ఈ నియమ, నిబంధనల జాబితాని ‘ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అంటారు.
సజావుగా, స్వేచ్ఛాయుతంగా ఎన్నికలను నిర్వహించడమే ఎన్నికల కోడ్ ప్రధాన లక్ష్యంగా ఉంది. ఓటర్లను ప్రభావితం చేసే చర్యలు, ఎన్నికల ప్రక్రియకు విఘాతం కలిగించే కార్యకలాపాలకు అడ్డుకట్ట వేయడం టార్గెట్‌గా ఎన్నికల సంఘం ఈ నిబంధనలు రూపొందిస్తుంది. ఎన్నికల్ షెడ్యూల్…