పొగాకు బ్యార్ని దగ్దం
BSB NEWS 21.03.2024
ప్రకాశం జిల్లా పొదిలి మండలం మాదాలవారిపాలెంలో పొగాకు బ్యార్ని అగ్నికి ఆహుతయింది. గ్రామంలోని నుగ్గు శ్రీనివాసులు అనే రైతుకి చెందిన పొగాకు బ్యార్నిలో ప్రమాదవశాత్తు నిప్పు చెలరేగడంతో బ్యార్ని దగ్ధమైనట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. వెంటనే కనిగిరి ఫైర్ స్టేషన్ కు సమాచారం అందించగా ఫైర్ సిబ్బంది ఘటన ప్రాంతానికి చేరుకొని మంటలను అదుపులోకి తెచ్చారు. ఈ ప్రమాదంలో తీవ్ర నష్టం వాటిల్లిందని రైతు శ్రీనివాసులు వాపోతున్నాడు.