కందుకూరులో దొంగల బీభత్సం
BSBNEWS17.03.2024
పట్టణంలోని కనిగిరి రోడ్డులో నివాసం ఉంటున్న కనమర్లపూడి శివరామకృష్ణ అనే బంగారం కుదవ వ్యాపారి ఇంట్లో దొంగలు బీభత్సం సృష్టించారు. విషయం తెలుసుకున్న కందుకూరు డిఎస్పి శ్రీనివాసరావు, సీఐ హనీఫ్ భాష సంఘటనా స్థలానికి చేరుకొని బాధితుల నుండి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా డి.ఎస్.పి శ్రీనివాసరావు, సీఐ హనీ భాష లు మాట్లాడుతూ తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వ్యక్తులు శివరామకృష్ణ అతని భార్యపై దాడికి చేసి 50 వేల రూపాయల నగదును తీసుకువెళ్లారని బాధితులు చెప్పడం జరిగిందని అన్నారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టడం జరుగుతుందని, త్వరలోనే దొంగలను పట్టుకుంటామని వారు తెలిపారు.