బుర్రా ను కలిసి మద్దతు తెలిపిన స్కంధపురి పెయింట్ యూనియన్ నాయకులు..

bsbnews
0

 బుర్రా ను కలిసి మద్దతు తెలిపిన స్కంధపురి పెయింట్  యూనియన్ నాయకులు

BSB NEWS 19.03.2024


వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ  కార్యాలయంలో కందుకూరు నియోజకవర్గం వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి  బుర్రా మధు సూదన్ యాదవ్ ని మంగళవారం స్కంధపురి పెయింట్ యూనియన్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి సంపూర్ణ మద్దతు తెలియజేసారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ రెక్కల కష్టం మీద ఆధారపడి జీవిస్తున్న ఆర్టిస్టులు, కాన్వాస్ పెయింటర్స్ ,గోడరాత , చిత్రకళాకారులు , అనేక రకాల  కుటుంబాలు అత్యధికంగా యూనియన్ లో వున్నామన్నారు. అధునాతన పోకడలు వలన మాకు ఉపాధి అవకాశాలు కూడా తగ్గి అనేక మంది అవస్థలు పడుతున్నారని తెలిపారు. జగనన్న మాలాంటి వారికి మ్యానిఫెస్టోలో ప్రాధాన్యత ఇచ్చే విధంగా చూడాలి అని కోరారు. ఎమ్మేల్యే అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ వెంటనే స్పందించి సంక్షేమ పథకాల రథసారథి జగనన్నను అడగాలే కానీ పేద ప్రజల కోసం కాదనేది ఏమి వుండదు అని, తక్షణమే నేను మన పార్లమెంటు అభ్యర్థి విజయసాయిరెడ్డి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తామని తెలిపారు. బుర్రాను కలిసిన వారిలో ప్రెసిడెంట్ జమ్మలమడుగు రవి, కార్యదర్శి కంకణాల బ్రహ్మయ్య, మాలకొండయ్య, బిట్రా శ్రీను, దగ్గుమాటి నాగరాజు, బడుగు చిన్న రోజా బాబు, చిన్న బ్రహ్మయ్య, కరిముల్లా తదితరులు పాల్గొన్నారు

Post a Comment

0Comments
Post a Comment (0)