BSB NEWS 21.03.2024
ఎన్నికల నిబంధనలు తప్పకుండా పాటించాలి అని రాజకీయ పార్టీ ప్రతినిధులకు కందుకూరు సబ్ కలెక్టర్ విద్యాదరి సూచనలు చేశారు. గురువారం పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో అన్ని రాజకీయ పార్టీ నాయకులతో ఎన్నికల కోడ్ నిబంధనల పై సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున ప్రతి ఒక్కరు ఎన్నికల నియమాలను పాటించాలని ఏ చిన్న కార్యక్రమానికైనా అనుమతులు తీసుకోవాల్సిందేనని అలా అనుమతులు లేని పక్షంలో వారిపై చర్యలు తీసుకోబడతాయని హెచ్చరించారు. ప్రతి రాజకీయ పార్టీ నాయకులు ఎన్నికల నిబంధనలకు సహకరించాలని ఆమె కోరారు.