వాలంటీర్లకు హెచ్చరిక చేసిన జిల్లా కలెక్టర్
BSB NEWS 21.03.2024
ప్రకాశం జిల్లా ఒంగోలు
రాష్ట్రంలో ఇటీవల ఎన్నికల కోడు అమలులోకి వచ్చిన నేపథ్యంలో ప్రచారాలు చేసుకోవాలన్నా, పోస్టర్లు
వేసుకోవాలంటే అనుమతులు తప్పనిసరని అని రాజకీయ పార్టీ నాయకులకు తెలిపిన జిల్లా కలెక్టర్ దినేశ్ కుమార్ తెలిపారు.
ఇందులో ముఖ్యంగా వాలంటీర్లు రాజకీయ పార్టీల ప్రచారంలో పాల్గొన్న, పార్టీ కండువాలు
వేసుకున్నా, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే జిల్లాలో కొంతమంది వాలంటీర్లను విధుల నుంచి తొలగించడం జరిగిందని అన్నారు.