రాష్ట్రం బాగుండాలంటే టీడీపీ రావాలి- ఎమ్మెల్యే స్వామి, దామచర్ల సత్య
పొన్నలూరు మార్చి 15 BSBNEWS:-
రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉండాలంటే తెలుగుదేశం అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని కొండపి నియోజకవర్గ శాసనసభ్యులు డా. డోల బాల వీరంజనేయ స్వామి తెలిపారు. మండలంలోని జడ్ మేకపాడు లో శుక్రవారం జరిగిన పార్టీ చేరికల కార్యక్రమంలో ఆయన దామచర్ల సత్యతో కలిసి హాజరయ్యారు. ఈ సంధర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండలంలో జరిగిన అభివృద్ధి మొత్తం తెలుగుదేశం పార్టీ హయాంలో జరిగినవేనని తెలిపారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో జడ్ మేకపాడు తో పాటు 32 గ్రామాల రోడ్లకు నిధులు విడుదల చేస్తే వైసీపీ ప్రభుత్వం పట్టించుకున్న పాపాన పోలేదని విమర్శించారు. మళ్ళీ గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. దామచర్ల సత్య మాట్లాడుతూ గత 30 సంవత్సరాలు గా నియోజకవర్గ ప్రజలకు సేవ చేసుకునే అదృష్టం దామచర్ల కుటుంబానికి కల్పించిన ప్రజలందరికీ కృతజ్ఞతలు తెలియజేసారు. దివంగత మంత్రి పెద్దాయన ఆంజనేయులు చూపిన అభివృద్ధి సంక్షేమం నియోజకవర్గ ప్రజలకు చేరువ చేసారన్నారు. తెలుగుదేశం పార్టీ చేసిన అభివృద్ధి చూసి నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజలు తెలుగుదేశం పార్టీలోకి రావడం సంతోషంగా ఉందన్నారు. మేకపాడు గ్రామంలో తెలుగు యువత నాయకులు కాటూరి వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో గ్రామనికి చెందిన మాజీ సర్పంచ్ కాటూరి వెంకటేశ్వర్లు, ప్రస్తుత ఉప సర్పంచ్ పాపినేని ప్రసాద్, కాటూరి సుబ్బారావు, కాటూరి లక్ష్మీ నారాయణ, కాటూరి వెంకటేశ్వర్లు, కాటూరి గురవయ్య, కాటూరి ప్రసాద్, కాటూరి మాల్యాద్రితో పాటు 15 కుటుంబాలకు చెందిన వారు వైసీపీ నుండి టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీలో చేరిన వారికి ఎమ్మెల్యే స్వామి, సత్య పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ముందుగా గ్రామంలో సత్య, స్వామి కి భారీ ఎత్తున స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు భేరి పుల్లారెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు అనుమోలు సాంబశివరావు, మాజీ అధ్యక్షులు మండవ ప్రసాద్, సీనియర్ నాయకులు కర్ణా కోటిరెడ్డి, పిల్లి వెంకట నారాయణరెడ్డి, సన్నమూరి నరసింహారావు, కాటూరి మాధవరావు, ఉన్నం బసవయ్య, తోపాటు పలు గ్రామాల టీడీపీ నాయకులు అనుబంధ సంఘాల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు