సబ్ డివిజనల్ పోలీసు అధికారిని కలసిన బా జ పా నాయకులు
BSBNEWS 19.03.2024
కందుకూరు పట్టణంలోని ఓ వి రోడ్డులోగల కనుమర్లపూడి వెంకటేశ్వర్లు ఇంటిలో 16వ తేదీ అర్ధరాత్రి సమయంలో ఆయన కుమారుడు శివరామకృష్ణను వారి శ్రీమతి నీ భయభ్రాంతులకు గురిచేసి , వారి పై అమానుషంగా దాడి చేసి నగదు దోచుకెళ్లిన వారిని గుర్తించి, దోషులకు కఠిన శిక్షలు పడేలా దర్యాప్తును వేగవంతంగా చేయాలని భాజపా నాయకులు శ్రీనివాసరావును కోరుతూ వినతి పత్రం అందజేశారు. వినతి పత్రం సమర్పించిన వారిలో అసెంబ్లీ సమన్వయకర్త ఘట్టమనేని హరిబాబుతో సహా సమన్వయకర్త జొన్నాదుల సురేష్, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు జొన్నాదుల రాఘవయ్య, పట్టణ శాఖ అధ్యక్షులు మన్నేపల్లి వరప్రసాదరావు, ఉపాధ్యక్షులు మాల్యాద్రి నాయుడు, సీనియర్ నాయకులు మువ్వల భూషయ్య, ఉన్నం భాస్కరరావు, ప్రధాన కార్యదర్శి చుండి మురళీధర్, కోశాధికారి చిన్ని పాండురంగయ్య, ఓ బి సి మోర్చా పట్టణ అధ్యక్షులు మాటూరి రమేష్ నాయుడు, కార్యదర్శి గోడ్డటి బాలరాఘవులు ఉన్నారు.