BSBNEWS 19.03.2024
మాజీ వైస్ ఎంపీపీ మార్తాలను పరామర్శించిన బుర్రా మధుసూదన్ యాదవ్
గుడ్లూరు మండలం బసిరెడ్డి పాలెం మాజీ వైస్ ఎంపీపీ మార్తాల రమణా రెడ్డిని కందుకూరు నియోజకవర్గ వైయస్సార్ సిపి అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ పరామర్శించి యోగక్షేమాలను విచారించారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న వెంటనే స్పందించి హుటాహుటిన మార్తాల రమణా రెడ్డి ఇంటికి వచ్చి ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. సోమవారం సాయంత్రం తెట్టు రోడ్డు వద్ద జరిగిన ప్రమాదంలో గాయపడి ఇంటి దగ్గర విశ్రాంతి తీసుకుంటున్న రమణా రెడ్డికి మనోధైర్యం చెప్పి నీకు అన్ని విధాలుగా నేను, వైయస్సార్ కుటుంబ సభ్యులం అందరం అండగా ఉంటాం అని భరోసా కల్పించారు. ఈసందర్భంగా మార్తాల రమణా రెడ్డి కుటుంబ సభ్యులను కూడా కలుసుకున్నారు. ఆయన వెంట గుడ్లూరు మండల వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నేతలు కార్యకర్తలు అభిమానులు అందరూ హాజరయ్యారు.