విగ్రహాలకు ముసుగులు వేయిస్తున్న మునిసిపల్ కమిషనర్ కృష్ణారెడ్డి
కందుకూరు మార్చి 16 BSBNEWS
కందుకూరు పట్టణంలో శనివారం ఈసీ విడుదల చేసిన ఎలక్షన్ కోడ్ సందర్భంగా కందుకూరు పట్టణంలో ఉన్న విగ్రహాలకు కందుకూరు మున్సిపాలిటీ కమిషనర్ కృష్ణారెడ్డి దగ్గర ఉండి వాటికి ముసుగులు వేయించారు. కందుకూరు పట్టణంలో బహిరంగంగా ఉన్న నాయకులు, పార్టీ ఫ్లెక్సీలు అన్నిటిని కూడా తొలిగించారు. కందుకూరు పట్టణంలోని సచివాలయం అన్నిటిలో ఉన్న పార్టీ ఫోటోలకు ముసుగులు వేయాలని సచివాలయ సిబ్బందికి ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కందుకూరు పట్టణం టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ శ్రీనివాసులు, ప్లానింగ్ సెక్షన్ సచివాలయ అధికారులు మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.