ఉలవపాడు మండలంలో టిడిపిలోకి భారీగా చేరికలు
BSBNEWS
ఉలవపాడు మండలం కరేడు పంచాయతీలోని హరిజనపాలెం, చైతన్య నగర్, చిన్న పల్లెపాలెం, అలగాయపాలెం గ్రామాలలో శనివారం తెలుగుదేశం పార్టీలోకి భారీగా చేరికలు జరిగాయి. ఈ గ్రామాలలో భారీ సంఖ్యలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి టిడిపి- బిజెపి- జనసేన పార్టీల ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరావు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. నాగేశ్వరరావు వారందరినీ సాదరంగా పార్టీలోకి ఆహ్వానిస్తూ స్వాగతం పలికారు. మీ అందరికీ పార్టీలో తగిన గుర్తింపు ఉంటుందని, రాబోయే ప్రభుత్వంలో అందరికీ న్యాయం చేస్తామని, ఎప్పుడు ఏ కష్టం వచ్చినా తను నేరుగా కలవచ్చని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో ఉలవపాడు మండల పార్టీ అధ్యక్షులు రాచగల్ల సుబ్బారావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు కన్నా ప్రసాద్ నాయకులు పోలుబోయిన శ్రీనివాసులు, చిట్టా బంగారు రెడ్డి మెట్ట శ్రీనివాసులు రెడ్డి, వాయిల శీను, వల్లభుని రమణయ్య, నాయుడు కోటయ్య, యరమల వాసు, నాళం సుధా, మద్దెల శ్రీధర్, కొల్లి రమణయ్య, తేజ, వెంకటరమణయ్య ఇతర నాయకులు పాల్గొన్నారు...