అభివృద్ధికి నాది హామీ...
బుర్రా మధుసూదన్ యాదవ్ వైఎస్ఆర్సిపి నియోజకవర్గ అభ్యర్థి.
BSBNESW
KANDUKUR
స్థానిక మూడవ సచివాలయం నాలుగవ వార్డ్ నల్లమల్ల వారి తోటలో ఈరోజు జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కందుకూరు వైఎస్ఆర్సిపి అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ ప్రతి ఇంటికి వెళ్లి కందుకూరు ని అభివృద్ధి చేసే బాధ్యతకు నాది హామీ అని సంక్షేమ ప్రదాత వైయస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో సంక్షేమ తో పాటు అభివృద్ధి కూడా శరవేగంగా సాగుతుందని కందుకూరు పట్టణాన్ని కూడా అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి పూర్తి బాధ్యత నేను తీసుకుంటానని ఈ సందర్భంగా ఓటర్లకు తెలియజేశారు. జగనన్న సన్నిహితుడుగా ఉన్న విజయ్ సాయి రెడ్డి నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఉండటం మనకు ఎంతో ఉపయోగకరమని ఈ సందర్భంగా తెలిపారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థులను గెలిపించుకుని కందుకూరు అభివృద్ధికి అందరూ సహకరించాలని ఫ్యాన్ గుర్తుపై ఎంపీ అభ్యర్థికి ఒక ఓటు ఎమ్మెల్యే అభ్యర్థిగా ఒక ఓటు ఫ్యాను గుర్తుపై రెండు ఓట్లు వేసి అత్యధిక మెజార్టీ తోటి గెలిపించాలని కోరారు. బుర్రా మధుసూదన్ యాదవ్ గారి తనయుడు యువ నాయకుడు బుర్రా వెంకట సాయి మాట్లాడుతూ రాష్ట్రంలో విప్లవాతకమైన మార్పుల్ని జగనన్న ద్వారా సాధ్యమైందని యువతకు ఉద్యోగ అవకాశాలు, నాణ్యమైన విద్య అందుబాటులోకి వచ్చిందని ప్రపంచ దేశాలతో పోటీపడి ఇంగ్లీష్ మాధ్యమంలో బోధనలు జరుగుతున్నాయని ఇది మన విద్యార్థులకు యువతకు ఎంతో ఉపయోగపడుతుందని తెలియజేస్తూ కలిసిన ఓటర్లందరికి ఫ్యాను గుర్తుకు ఓటు వేయాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు షేక్ రఫీ, సచివాలయం కన్వీనర్లు కందుకూరు శ్రీనివాస దీక్షితులు, చీమకుర్తి కృష్ణారెడ్డి,చనమాల కోటేశ్వరరావు వైఎస్ఆర్సిపి నేతలు గణేశం గంగిరెడ్డి, రావులకోలు బ్రహ్మానందం, రేణమాల అయ్యన్న ,ఎడ్ల తిరుపాలు రెడ్డి, శ్రీకాంత్, ఇనకొల్లు మస్తానయ్య, గేరా మనోహర్, చనమాల శ్రీధరు, జాజుల కోటేశ్వరరావు, రావినూతల రాజు, తానికొండ శ్రీను, తానికొండ హరిబాబు, షేక్ హమీద్, పివి రమణయ్య యాదవ్, గల్లా వెంకటేశ్వర్లు, పాల శ్రీను, పి శ్రీనివాసు,షేక్ దస్తగిరి, జె.థామస్, కాజా హుస్సేన్, జంగిలి ఇశ్రాయేలు, ఎం లాజరు మహిళా నాయకులు తలారి ప్రసన్నకుమారి, లక్ష్మీకాంతం, డి.లక్ష్మి, షేక్ ఆదాంబి తదితరులు పాల్గొన్నారు. సచివాలయ కన్వీనర్ శ్రీనివాస్ దీక్షితులు దుశ్యాలువాతో సన్మానం చేసి పూల బొకే తోటి స్వాగతం పలికారు.