కావలి రూరల్ లో వైసీపీకి భారీ షాక్
BSBNEWS KAVALI
కావలి రూరల్ మండలంలోని సర్యాయపాలెం మాజీ సర్పంచ్ గుడిపల్లి నారయ్య వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళవారం రాత్రి కావలి రూరల్ మండలం సర్వాయపాలెంలో జరిగిన కార్యక్రమంలో ఆయనకు కావలి అసెంబ్లీ టీడీపీ - జనసేన - బీజేపీ ఉమ్మడి అభ్యర్థి కావ్య క్రిష్ణారెడ్డి టీడీపీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు. క్రిష్ణారెడ్డి మాట్లాడుతూ ఉగాది పండుగ నాడు నారయ్య తెలుగుదేశం పార్టీలో చేరడం సంతోషంగా ఉందన్నారు.రెండుసార్లు సర్పంచ్ గా చేసిన అనుభవం పార్టీకి ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఆయన సలహాలు, సూచనలు పాటిస్తూ కావలి రూరల్ మండలం లో భారీ మెజారిటీ సాధిస్తామని తెలిపారు.