మీడియాను చిన్నచూపు చూస్తున్న వైసీపీ అభ్యర్థి బుర్రా

bsbnews
0

 మీడియాను చిన్నచూపు చూస్తున్న వైసీపీ అభ్యర్థి బుర్రా



BSBNEWS//కందుకూరు



కందుకూరు పట్టణంలోని వైసీపీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బుర్రా మధుసూదన్ యాదవ్ మీడియా పట్ల చిన్నచూపు చూస్తున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితి కందుకూరు లో నెలకొంది. ఎన్నికల సమయంలో తమ ప్రచారాన్ని ఎప్పటికప్పుడు తమ పత్రికలలో ప్రచురించాలని పదేపదే తమ వైసిపి మీడియా కోఆర్డినేటర్లు ద్వారా తెలియపరుస్తున్నారు. అయితే విభజించు పాలించు అనే ధోరణిలో కందుకూరు మీడియా మిత్రులను సైతం కొంతమందికి ప్రాధాన్యతను ఇస్తూ మిగిలిన వారిని చిన్నచూపు చూడటంతో మీడియా సంఘాలు మండిపడుతున్నాయి. ప్రాధాన్యతను ఇస్తున్న వారికి గత రెండు రోజుల క్రితం ఒక్కొక్కరికి పదివేల రూపాయలు చొప్పున తాయిలాలు ఇచ్చారన్న ప్రచారం కందుకూరులో జోరుగా సాగుతుంది. రాజకీయ పార్టీలకు అధికారులకు ప్రభుత్వానికి మధ్య వారదులుగా పని చేసే మీడియా ప్రతినిధులతోటే వైసిపి ఎమ్మెల్యే అభ్యర్థి బుర్ర మధుసూదన్ తీరు ఇలా ఉంటే వైసిపి పార్టీని నమ్ముకున్న వైసిపి కార్యకర్తలు, నాయకులు పరిస్థితి ఇంకెలా ఉంటుందోనని ప్రజలు చర్చించుకుంటున్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)