కందుకూరు నియోజకవర్గ జై భారత్ నేషనల్ పార్టీ MLA అభ్యర్ధిగా పొడపాటి శివకుమార్
BSBNEWS KANDUKUR,
జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జేడి లక్ష్మి నారాయణ గారు కందుకూరు నియోజకవర్గ MLA అభ్యర్ధిగా పొడపాటి శివకుమార్ ను ప్రకటించడం జరిగింది. ఈ సందర్భంగా పొడపాటి శివకుమార్ మాట్లాడుతూ తనకి అవకాశాన్ని కల్పించిన జై భారత్ నేషనల్ పార్టీ అధ్యక్షులు జేడి లక్ష్మి నారాయణ గారికి మరియు పార్టీ స్టేట్ సెక్రీటరీ మాకినేని అరుణ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. తప్పకుండా కందుకూరు ప్రజానికా సమస్యల పరిష్కారానికి మరియు నియోజకవర్గ అభివృద్ధి దిశగా కృషి చేస్తానని తెలిపారు. జై భారత్ పార్టీ ప్రజా మేనిఫెస్టో మరియు సిద్ధాంతాలను నియోజకవర్గ ప్రజలకి వివరించి పార్టీ బలోపేతానికి కృషి చేస్తా అన్నారు.