పిఎం ప్రణం ప్రోగ్రాం ద్వారా రైతులకు అవగాహన

bsbnews
0


 పిఎం ప్రణం ప్రోగ్రాం ద్వారా రైతులకు అవగాహన


కందుకూరు మండలంలోని అన్ని గ్రామాలలో వున్న రైతు భరోసా కేంద్రాలలో ఈ నెల 20వ తేదీనుండి 28వ తేదీ వరకు రసాయనిక ఎరువుల వాడకం తగ్గించి , సేంద్రీయ ఎరువులు, జీవన ఎరువులు, పచ్చిరొట్ట ఎరువులు వాడకం మీద - భూసార పరిరక్షణకు రైతులకు అవగాహన సదస్సులను పిఎం ప్రణం ప్రోగ్రామ్ ద్వారా జరుగుతాయని కందుకూరు మండల వ్యవసాయాధికారి వి.రాము తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 20/5/24 మాచవరం & మోపాడు, 21/5/24 కొండముడుసుపాలెం & కంచరగుంట, 22/5/24 కోవూరు & పందలపాడు, 23/5/24 విక్కిరాలపేట & కొండి కందుకూరు, 24/5/24 మహాదేవపురం & పలుకూరు, 25/5/24 ఆనందపురం & ఓగురు, 27/5/24 పాలూరు & వెంకటాద్రిపాలెం, 28/5/24 G. మేకపాడు గ్రామాలలో ఉదయం 10 గం &11.30 గం లకు వుంటుందని అన్నారు. ఈ ప్రోగ్రాం లో శాస్త్రవేత్తలు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది , జిల్లా వనరుల కేంద్రం అధికారులు పాల్గొంటారని,  రైతులందరూ హాజరయ్యి ప్రోగ్రాం విజయవంతం చేయాలని ఆయన తెలియజేశారు.

Post a Comment

0Comments
Post a Comment (0)