సేవకు సత్కారం
BSBNEWS - KANDUKUR
ఏసియా ఇంటర్నేషనల్ కల్చరల్ రీసెర్చ్ యూనివర్సిటీ వారు సామాజిక సేవలో భాగంగా ఆదివారం తమిళనాడు హోసూర్ లో హోటల్ హిల్స్ నందు పలు అవార్డులను అందజేశారు. కందుకూరు పట్టణానికి చెందిన అల్ ఇండియా వాసవి సత్ర సముదాయాల మీడియా చైర్మన్ చక్కా వెంకట కేశవరావు కు గౌరవ డాక్టరేట్ ప్రధానం చేయడం జరిగింది. ఈ సందర్భంగా చక్కా వెంకట కేశవరావు మాట్లాడుతూ ఈ అవార్డు రావడం చాలా ఆనందంగా ఉంది అని అన్నారు. నా సేవా కార్యక్రమాలకు సహకారం అందిస్తున్న ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు.