ధృవపత్రాలు లేని వివిధ ద్విచక్ర వాహనాలు స్వాధీనం
BSBNEWS - KANDUKUR
కందుకూరు పట్టణం ఉప్పు చెరువులో ఆదివారం ఉదయం పట్టణ పోలీసులు కార్డెన్ సెర్చ్ నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ ఎస్.ఐ ఆనంద్ భాస్కర్ బాబు మాట్లాడుతూ జిల్లా ఎస్పి ఉత్తర్వుల మేరకు కందుకూరు డీఎస్పీ శ్రీనివాసులు, కందుకూరు సీఐ హనీఫ్ ఆదేశానుసారం కార్డెన్ సెర్చ్ నిర్వహించడం జరుగుతుంది అని తెలిపారు.
ధృవపత్రాలు లేని వివిధ ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకోవడం జరిగిందన్నారు.
సామాన్య ప్రజలలో ధైర్యం నింపుతూ పోలీసు వ్యవస్థ పట్ల విశ్వాసం పెంచటానికి ఈ కార్డన్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించడం జరుగుతుందని ఆయన అన్నారు. ఈ ఆపరేషన్ లక్ష్యం పరారీలో ఉన్న నేరస్తులను గుర్తించి అదుపులోకి తీసుకోవడం, చోరీ సొత్తు, అనుమానంగా ఉన్న రికార్డులు లేని అన్నీ వస్తువులు, వాహనాలు, అక్రమ మద్యం, ఆయుధాలు, పేలుడు పదార్ధాలు, మాదక ద్రవ్యాలు వాటివి గుర్తించి స్వాధీన పరుచుకోవడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.