పోలీస్ స్టేషన్ కు చేరిన సచివాలయం ప్రేమ వ్యవహారం

bsbnews
0

సచివాలయం మహిళా ఉద్యోగిని ని నమ్మించి మోసం చేసిన అడ్మిన్

సబ్ కలెక్టర్ ను ఆశ్రయించిన న్యాయం జరగకపోవడం విశేషం


పోలీస్ స్టేషన్ కు చేరిన సచివాలయం ప్రేమ వ్యవహారం

ఆమెకు న్యాయం జరిగే వరకూ న్యాయపోరాటం చేస్తామన్న యానాదుల సంక్షేమ సంఘం నాయకులు

BSBNEWS - కందుకూరు

ప్రేమ అనే పేరుతో నమ్మించాడు అమ్మాయి నమ్మింది. దాదాపు రెండు సంవత్సరాలపాటు కాలం గడిపాడు. అవసరాలన్నీ తీర్చుకున్నాడు. ఆమె పెళ్లి ప్రస్తావన తీసుకొచ్చింది. చేసుకుంటాను అని చెబుతూ మన విషయం ఎవరికైనా చెబితే నేను ఆత్మహత్య చేసుకుంటానని మానసిక బ్లాక్మెయిల్ చేశాడు. అప్పుడు కూడా ఆమె నమ్మింది. తీరా గట్టిగా నన్ను ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అని అడిగితే నీ కులం తక్కువ నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని ఎలా అనుకున్నావు అని మాట మార్చేశాడు. దాంతో చేసేది లేక సబ్ కలెక్టర్ ను ఆశ్రయించింది. ఆమె సమస్య పరిష్కరించాలని పోలీసులకు ఆదేశాలు జారీచేసింది. అయినా ఆమెకి న్యాయం జరగలేదు. నమ్మించి మోసం చేసిన ఆ వ్యక్తి పలుకుబడితో పోలీసులు పై ఒత్తిడి తెస్తూ వారికి సైతం మాయమాటలు చెబుతూ కాలం గడపసాగాడు. దాంతో ఆ మహిళ యానాది సంక్షేమ సంఘం నాయకులను ఆశ్రయించింది.   ఇది ఎక్కడో కాదు నెల్లూరు జిల్లా కందుకూరులో జరిగిన సంఘటన. 2019 ఎన్నికల అనంతరం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు సచివాలయాల వ్యవస్థను తీసుకువచ్చి నిరుద్యోగులకు ఉపాధి కల్పించారు. ఆ సచివాలయాల్లో మహిళలకు ప్రాధాన్యతనిస్తూ పలు శాఖలకు ఎక్కువ శాతం మహిళలను కేటాయించింది. తోటి మహిళా ఉద్యోగునికి అన్యాయం జరుగుతున్న మిగిలిన మహిళా ఉద్యోగులు చూస్తూ చోద్యం చూస్తున్నారు తప్ప ఆమెకి న్యాయం చేయాలని ముందుకు రావడం లేదు. అందుకు కారణం రాజకీయాలకు భయపడుతున్నారా లేదా మనకెందుకులే అని ఎవరికివారు సరిపెట్టుకుంటున్నారా అర్థం కాని ప్రశ్నగా మారింది. ఇదిలా ఉంటే గతంలో కందుకూరులో సాక్షాత్తు కందుకూరు డిఎస్పి కార్యాలయంలోనే ఒక మహిళకు అటువంటి సంఘటన ఎదురైనప్పుడు సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు సైతం న్యాయం జరిగేంత వరకు పోరాటం చేసి ఆ మహిళకు న్యాయం చేసిన సంఘటన ఉంది.   మున్సిపాలిటీ పరిధిలోని 8వ సచివాలయంలో పనిచేస్తున్న ఒక మహిళా ఉద్యోగిని అదే సచివాలయంలో విధులు నిర్వహించే అడ్మిన్ నమ్మించి మోసం చేశాడని యానాదుల సంక్షేమ సంఘంను ఆ మహిళా ఉద్యోగిని ఆశ్రయించడం జరిగింది అని యానాదుల సంక్షేమ సంఘం ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షులు చేవూరు దుర్గాప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మున్సిపాలిటీ పరిధిలోని ఎనిమిదవ సచివాలయంలో విధులు నిర్వహిస్తున్న ఒక మహిళను అదే సచివాలయంలో అడ్మిన్ గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి ఆమెతో దాదాపు రెండు సంవత్సరాలపాటు ప్రేమ వ్యవహారం నడిపారని పెళ్లి చేసుకోమని అడిగితే మాట దాటేస్తూ నిన్ను పెళ్లి చేసుకునేది లేదంటూ చెప్పడంతో ఆమె చేసేది లేక సచివాలయం ఉన్నతాధికారైన సబ్ కలెక్టర్ ను ఆశ్రయించింది అని, విషయం తెలుసుకున్న సబ్ కలెక్టర్ సమస్య పరిష్కరించాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది అని అయినా ఆమెకి న్యాయం జరగకపోవడంతో మా దృష్టికి తీసుకువచ్చిందని ఆయన తెలిపారు. విషయం తెలిసిన మేము పోలీసులను ప్రశ్నించామన్నారు. ఇద్దరు మేజర్లు కావడంతో ఇరు కుటుంబాల పెద్దలు మాట్లాడుకుంటామని అడ్మిన్ కుటుంబ సభ్యులు చెప్పి రోజులు గడుపుతున్నారని ఆయన పేర్కొన్నారు. పోలీస్ స్టేషన్ లోనే మహిళకు న్యాయం జరగకపోతే రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన దిశ చట్టాలు ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. మోసపోయిన ఆ మహిళకు న్యాయం జరిగేంతవరకు మేము న్యాయపోరాటానికి అయినా సిద్ధం అవుతామని ఆయన తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగం చేసే మహిళలకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల కోసం ఏర్పాటు చేసిన చట్టాలు వలన న్యాయం జరగకపోతే సామాన్య మహిళల పరిస్థితి ఇంకెలా ఉంటుందో అర్థమవుతుందని ఆయన విమర్శించారు. ఆమెకు న్యాయం జరగడం కోసం త్వరలోనే జిల్లా కలెక్టర్ ను, జిల్లా ఎస్పీ ని యానాదుల సంక్షేమ సంఘం ద్వారా ఆశ్రయించటం జరుగుతుందని ఆయన తెలిపారు.

Post a Comment

0Comments
Post a Comment (0)