ఆగ్రామంలో అస్వస్థతకు గురైన ప్రజలు - పరామర్శించిన ఎమ్మెల్యే సతీమణి

bsbnews
0

ఆగ్రామంలో అస్వస్థతకు గురైన ప్రజలు

పరామర్శించిన ఎమ్మెల్యే సతీమణి


BSBNEWS  -  KAVALI



 

మండలంలోని సర్వాయపాలెం పంచాయతీ మాతనవారిపాలెంలో పలువురు గ్రామస్తులు అస్వస్థతకు గురయ్యారు. సర్పంచ్ యానాదయ్య ద్వారా సమాచారం అందుకున్న కావలి శాసనసభ్యుడు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి తక్షణం స్పందించి వెంటనే జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారులు దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో ఆ శాఖ సిబ్బంది గ్రామానికి చేరుకొని నీటి నమూనాలను పరీక్షించారు. ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆరోగ్య పరీక్షలు చేశారు. అనంతరం నీరు కలుషితం కాలేదని నిర్ధారించారు. అయితే కలుషిత ఆహారం కారణంగా పలువురికి విరోచనాలు తదితర సమస్యలు ఏర్పడ్డాయని వైద్య సిబ్బంది తేల్చి చెప్పారు. అస్వస్థతకు గురైన వారిని కావలి పట్టణంలోని ఉమాచంద్ ఆసుపత్రికి తరలించగా ఎమ్మెల్యే సతీమణి ఆదిలక్ష్మి హుటాహుటిన ఈ వైద్యశాలకు చేరుకొని రోగులను పరామర్శించారు. వీరికి మెరుగైన చికిత్స అందించాలని కోరారు. అవసరమైతే నెల్లూరుకు తరలించాల్సి వస్తే అందుకు అయ్యే ఖర్చు మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని హామీ ఇచ్చారు. ఎవరు ఎటువంటి అధైర్య పడవద్దని మీకు మేమున్నామని భరోసా ఇచ్చి బాధితులను అక్కున చేర్చుకొన్నారు. తప్పు ఎక్కడ జరిగిందో అధికారులు తెలుసుకొని వివరణ ఇవ్వాలని సంబంధిత అధికారులను కోరారు.


Post a Comment

0Comments
Post a Comment (0)