కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ కేంద్రంలో 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవ వేడుకలు
BSBNEWS-KANDUKUR
కందుకూరు పట్టణంలోని కస్తూర్బా గాంధీ బాలిక విద్యాలయ కేంద్రంలో శుక్రవారం 10వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. కందుకూరు డివిజన్ ఆయుష్ శాఖ వైద్యాధికారుల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కెజిబివి విద్యార్ధినులు చేసిన యోగా భంగిమలు చూపరులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఆయుష్ శాఖకు చెందిన వైద్యాధికారులు డాక్టర్ పద్మజా కుమారి, డాక్టర్ లక్ష్మీ కుమారి, డాక్టర్ విమల, డాక్టర్ రత్నావళి యోగ ప్రాముఖ్యత, విశిష్టత గురించి విద్యార్థినులకు అవగాహన కల్పించారు. భారతదేశంలో ఋషుల కాలం నుండి ప్రాచుర్యంలో ఉన్న యోగా ప్రక్రియ ఈరోజు విశ్వవ్యాప్తంగా ఎంతో ఆదరణకు నోచుకుందని అన్నారు. మానవ జీవితాన్ని ఆరోగ్యవంతంగా తీర్చిదిద్దడంలో యోగా ఎనలేని పాత్ర పోషిస్తుందని అన్నారు.