నందమూరి బాలకృష్ణ 64 వ పుట్టినరోజు వేడుకలలో ఎమ్మెల్యే ఇంటూరి
BSBNEWS - KANDUKUR
హిందూపురం శాసనసభ్యులు, లెజెండ్, నందమూరి బాలకృష్ణ 64 వ పుట్టినరోజు వేడుకలు కందుకూరులోని TDP కార్యాలయంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు ముఖ్యఅతిథిగా హాజరై, బాలయ్య అభిమానులు ఏర్పాటు చేసిన భారీ కేక్ ను కట్ చేసి బాలయ్య బాబుకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, నార్నే రోశయ్య, వేముల గోపాల్ రావు, మాదాల లక్ష్మీనరసింహం, పార్టీ నాయకులు, కార్యకర్తలు, బాలకృష్ణ అభిమానులు పాల్గొన్నారు.