కందుకూరు చరిత్రను మార్చిన ఇంటూరి

bsbnews
0


కందుకూరు చరిత్రను మార్చిన ఇంటూరి 

 

BSBNEWS - KANDUKUR

కందుకూరులో మానుగుంట మహీదర్ రెడ్డి 2019 లో ఉన్న రికార్డును ప్రస్తుత ఉమ్మడి కూటమి అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు బద్దలు కొట్టి రికార్డు సృష్టించారు. 2019లో 14936 ఓట్ల ఆదిక్యతతో పోతుల రామారావు పై విజయం సాధించి రికార్డు సృష్టించారు. ఆ రికార్డును 2024 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి బుర్ర మధుసూదన్ యాదవ్ పై ఉమ్మడి కూటమి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు 17813 పైగా ఆదిక్యత సాధించి మానుగుంట మహీదర్ రెడ్డి రికార్డును బద్దలకొట్టి చరిత్ర సృష్టించారు. ఈ విజయానికి ఇంటూరి నాగేశ్వరరావు పడ్డ కృషి ఎనలేనిదని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. 20 సంవత్సరాలు తర్వాత తెలుగుదేశం పార్టీ విజయంతో కందుకూరులో తెలుగు తమ్ముళ్ల జోరు చూస్తుంటే పార్టీ విజయానికి వారు పడ్డ శ్రమను మరిచిపోయేలా ఉందని వైసీపీ శ్రేణులతో సహా చెప్పుకుంటున్నారు. కందుకూరులో టిడిపి జెండా ఎగరేసేందుకు అనేక దఫాలు సీనియర్ నేతలు ప్రయత్నించినా వారి ప్రయత్నానికి తగ్గ ఫలితం లభించలేదు. అయితే ఇంటూరి నాగేశ్వరరావు మాత్రం కందుకూరులో మళ్లీ టీడీపీ జెండాను ఎగరవేసి టీడీపీ శ్రేణుల్లో మరింత ఉత్సాహాన్ని నింపారు. కందుకూరులో అభివృద్ధి అంటే ఏమిటో ఇప్పుడు మొదలవుతుందని టిడిపి అభ్యర్థితో పాటు టిడిపి ముఖ్య నేతలు బలంగా చెబుతున్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)