ఇంటూరి గెలుపు పై పాదయాత్ర చేస్తున్న అభిమానులకు సంఘీభావం తెలిపిన పలువురు నాయకులు

bsbnews
0

 ఇంటూరి గెలుపు పై పాదయాత్ర చేస్తున్న అభిమానులకు సంఘీభావం తెలిపిన పలువురు నాయకులు



BSBNEWS - KANDUKUR

కందుకూరు నియోజకవర్గములో  రెండు దశాబ్దాల తర్వాత తెలుగుదేశం పార్టీ జెండాను కందుకూరు గడ్డమీద ఎగరవేసి కందుకూరు నియోజకవర్గంలో ఎన్నడూ రాని భారీ మెజారిటీతో ఎమ్మెల్యేగా ఇంటూరి నాగేశ్వరరావు  గెలిచినందుకు ఇంటూరి నాగేశ్వరావు అభిమానులు మొక్కు తీర్చుకునేందుకు, కందుకూరు అంకమ్మ తల్లి ఆలయం నుంచి తిరుమలకు పాదయాత్ర నాలుగవ రోజు నెల్లూరు దాటి యాత్రలో ఉన్నవారికి  నేషనల్ హైవే పై కందుకూరు నియోజకవర్గ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా



కందుకూరు నియోజకవర్గ ఐటిడిపి అధ్యక్షుడు షేక్ మున్నా, చెర్లోపాలెం టిడిపి నాయకుడు బూసి హరిబాబు. మద్దులూరి రమణయ్య,  కందుకూరు మత్స్యకారుల సంఘం అధ్యక్షులు కొంగల నాగరాజు, పాదయాత్రలో ఉన్న ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు అభిమానులను ధుశాలువా, పూల దండలతో ఘనంగా సత్కరించారు. తిరుమల దర్శనం వరకు జాగ్రత్తగా పాదయాత్ర ప్రయాణం చేయాలని అబ్బూరి వేణు బృదంకు సూచించారు. ఈ పాదయాత్ర  అబ్బూరి వేణు ఆధ్వర్యంలో అబ్బూరి చందు, మధిర  బ్రహ్మరూప్, పత్తిపాటి పవన్, మద్దెల సాయి, వేములూరి సాయి, వేములూరి బ్రహ్మం, కొంగల సాయి ప్రకాష్,  వేంకట్, రమణయ్య, సంపత్, శ్రీను, ఇంకా పలువురు పాల్గొంటున్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)