కాలేజీ, స్కూల్ బస్సులకు ఫిట్నెస్ లు తప్పని సరి - ఎస్ కె. యండి.రఫీ
BSBNEWS - KANDUKUR
పాఠశాలలు, కాలేజీలు పునః ప్రారంభం అయినందువలన ప్రతి ఒక్క విద్యాసంస్థల యజమానులు మీ యొక్క కాలేజీ, స్కూల్ బస్సులకు ఫిట్నెస్ లు తప్పని సరిగా చేపించుకోవాలని, మోటారు వాహనముల తనిఖీ అధికారి ఎస్ కె. యండి.రఫీ తెలిపారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ కందుకూరు ఎం.వి. ఐ ఆఫీస్ పరిధిలో ఇప్పటి వరకు 50 వాహనములు ఫిట్నెస్ జారీచేయటం జరిగినదన్నారు. కళాశాలలు పునః ప్రారంభించిన సందర్భముగా నెల్లూరు జిల్లా డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనరు ఆదేశాల మేరకు ఫిట్నెస్ లేని విద్యాసంస్థలకు సంబందించిన బస్సులపై స్పెషల్ డ్రైవ్ ని నిర్వహిచుట జరుగునని, ప్రతిరోజు తనిఖీలు చేయడం జరుగుతుందని ఈ తనిఖీలలో ఫిట్నెస్ లేకున్నా , టాక్స్ , పర్మిట్, డ్రైవింగ్ లైసెన్స్ లేకున్నా, పరిమితికి మించి విద్యార్థులను ఎక్కించినా, అతి వేగంగా స్కూల్ వాహనములు నడిపినా బస్సులను సీజ్ చేయడం జరుగునని తెలియజేశారు. విద్యాసంస్థలకు సంబందించిన బస్సులు నడుపు డ్రైవర్లు 60 సంవత్సరముల లోపువారై మాత్రమే ఉండాలన్నారు. 60 సంవత్సరములు దాటినా డ్రైవర్లు విద్యాసంస్థలకు సంబందించిన బస్సులు నడుపరాదని తెలియజేశారు.