లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తే కఠిన చర్యలు తప్పవు - డోన్ ఆర్డిఓ బి. మహేశ్వర్ రెడ్డి
14-06-2024
BSBNEWS - డోన్ పట్టణం :-
డోన్ లో రెవెన్యూ డివిజనల్ కార్యాలయం నందు ఆర్ డీ. ఓ బి.మహేశ్వర రెడ్డి ఆధ్యర్యం లో పి సీ పి ఎన్ డీ టి అడ్వైసరీ, మల్టీ మెంబెర్స్ అప్రప్రియేట్ అథారిటీ సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్డీవో బి. మహేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ జనటిక్ స్కానింగ్ సెంటర్స్ వారు పూర్వ గర్భస్థ పిండ లింగ నిర్ధారణ చేసి ఆడబిడ్డను గుర్తించి భృణ హత్యలకు పాల్పడితే పి సీ పి ఎన్ డీ టి యాక్ట్ 1994 చట్టం ప్రకారం క్రిమినల్ కేసులు పెట్టి కఠిన చర్యలు తీసుకొన బడునని హెచ్చరించారు. కమిటీ మెంబెర్స్ పి సీ పి ఎన్ డీ టి యాక్ట్ పైన ప్రజల కు అవగాహన కల్పించాలని తెలపడం జరిగింది. కార్యక్రమం లో డోన్ డివిజినల్ పి సీ పి ఎన్ డీ టి అడ్వైసరీ, మల్టీ మెంబెర్స్ అప్రప్రియేట్ అథారిటీ కమిటి సభ్యులు డాక్టర్. రామకృష్ణ, డాక్టర్. నితీష్, ఎన్ జి ఓలు సామాజిక కార్యకర్త పి. మహమ్మద్ రఫి ,అడ్వకేట్ మధుసుధన్ రెడ్డి,ఏ.ఈ. నాగరాజు, ఆరోగ్య విద్యా భోదకుడు రాఘవేంద్ర గౌడు పాల్గొన్నారు.