రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించాలి - డి చిన్నప్ప యాదవ్
BSBNEWS - శింగనమల
ఏపి రైతుసంఘము రాష్టసమితి పిలుపుమేరకు రైతాంగ సమస్యలు పరిష్కారము కోరకు శింగనమల ఎంపీడీవో కార్యాలయములో జనరల్ బాడీ సమావేశములో శింగనమల నియోజకవర్గ శాసనసభ్యులు బండారు శ్రావణికీ ఏపి రైతుసంఘము తరపున వినతి పత్రము అందించడము జరిగింది. ఈ సంధర్బంగా జిల్లా రైతుసంఘము అద్యక్షులు డి.చిన్నప్పయాదవ్ మాట్లాడుతూ, అన్నదాత సుఖీభవ పథకము క్రింద ప్రకటించిన 20,000రూ"తక్షణమే ఈఖరీప్ నుండి రైతులకు అందించాలని కోరారు. శింగనమల నీయోజకవర్గము తో పాటు అనంతపురము జిల్లా రైతులు వరుస విపత్తులతో, కరువుకాటకాలతో నిత్యము పంటలు సాగుచేసి అప్పులు పాలవుతున్నారని, ఏంతమంది పాలకులు వచ్చినా పాలకులు రాతలు బాగున్నాయి కానీ, రైతులు తలరాతలు మాత్రము చిద్రము అవుతున్నాయి అని అన్నారు. వరుసగా ఖరీఫ్ లో నష్టపోతే పంటలు భీమా లేదు, అరకోరగా పంట నష్టపరిహరముతో పాటు కరువు మండలాలు గా ప్రకటించినారు కాని రైతులకు ఫలితము శూన్యము అని, రభీలో కూడ కరువు మండలాలుగా ప్రకటించి చేతులు దులుపుకున్నారు తప్ప ఇంతవరకు సహయచర్యలు చేపట్టలేదన్నారు , రైతులు పరిస్థితి రాను రాను పాలకులపై నమ్మకము సన్నగిల్లుతున్నది అని, సాగునీటి ప్రాజెక్టుల పరిస్థితి గతఅయిదు సంవత్సరములలో ఒక్కరూపాయి కూడ నిధులు కేటాయించక కాలువలు, బ్రిడ్జీలు శిదిలావస్థకు చేరి నీరు చివరి అయికట్టు వరకు నీరు అందక పంటలుఎండిపోతున్నాయి అని, ప్రస్తుత ప్రభుత్వమైనా రైతులని అన్ని విధాలుగా ఆదుకోవాలని కోరుతూ పలు డిమాండ్లను తక్షణమే అమలు చేయాలి అని అన్నారు.
వారి డిమాండ్లు:-
(01) ప్రభుత్వం ప్రకటించిన సాగు సాయం రైతుకు 20 వేలు ఈ ఖరీఫ్ సీజన్లోనే అందించేందుకు కృషి చేయాలి.
(02) పెరిగిన ఉత్పత్తి ఖర్చుల కనుగుణంగా స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ పెంచి వంట రుణాలు
3 లక్షల వరకు వడ్డీలేకుండా 5 లక్షల వరకు పావలా వడ్డీతో ఇవ్వాలి. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇచ్చే ప్రక్రియ చేపట్టి రుణాలు అందించాలి. (03) రాష్ట్రంలోని ప్రాజెక్టుల క్రింద ఉన్న ప్రధాన కాలువలు, మేజర్, మైనర్ కాలువలతోపాటు డెల్టా ప్రాంతాల్లోని మురుగు నీటి కాలువుల మరమ్మత్తులు వెంటనే చేపట్టాలి.
(04) గత ప్రభుత్వ హయాంలో వ్యవసాయ అనుబంధ రంగాల ద్వారా రైతాంగానికి చెల్లించాల్సిన నిధుల బకాయలపై శ్వేతపత్రం విడుదల చేయాలి.
(05) గత రబీ కాలంలో ప్రభుత్వం సేకరించిన ధాన్యం బకాయలను రైతాంగానికి వెంటనే చెల్లించాలి.
(06) నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల రద్దు చేయాలి.
(07) శాసనసభా సమావేశాలలో లాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు బిల్లును సభలో ప్రవేశపెట్టి ఆమోదింప చేయాలి.
(08) ఖరీఫ్ సాగుకు అవసరమైన పచ్చిరొట్ట విత్తనాలు, వరి, వేరుశనగ, కంది తదితర విత్తనాలను 90% సబ్సిడీ పై రైతాంగానికి అందించాలి.
(09) వ్యవసాయానికి అవసరమైన ఎద్దులు, బండ్లు, నాగలి తదితర మనిముట్ల కొనుగోలుపై 50 శాతం సబ్సిడీ అందించాలి. ట్రాక్టర్లకు 50 శాతం సబ్సిడీపై డీజిల్ సరఫరా చేయాలి.
(10) కల్తీ విత్తనాలను అరికట్టి కల్తీ విత్తనాలు అమ్ముతున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకొనేలా చట్టంలో మార్పులు
(11) పర్యావరణ పరిరక్షణకు ప్రత్యేక నిధులు కేటాయించాలి. వర్షాకాలం ప్రారంభమైనందున మొక్కలు నాటే కార్యక్రమాన్నితేవాలి. ప్రభుత్వం యుద్దప్రాతిపదికన చేపట్టాలి.
(12)బిందుతుంపెర సేద్యపరికరాలు 10ఏకరములవరకు 90శాతము సబ్సీడితోరైతులకుఅందించాలి.
(13) అటవీ జంతువుల దాడిలో మరణించిన రైతుకుటుంబాలకు 15 లక్షల రూపాయలు. గాయపడిన వారికి 5లక్షల రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలి. అలాగే నష్టపోయిన ఆహార పంటలకు ఎకరాకు 30 వేలు, వాణిజ్య పంటలకు ఎకరాకు 75 వేలు, ఉద్యాన పంటలకు ఎకరాకు లక్ష రూపాయలు నష్టపరిహారం చెల్లించాలి. (14) గత సంవత్సరం రబీ కాలంలో కరువువల్ల నష్టపోయిన రైతులకు నష్టపరిహారం వెంటనే చెల్లించాలి. పంటల భీమా నిధులు విడుదల చేయాలి.
(15) గత తెలుగుదేశ ప్రభుత్వం ప్రకటించిన రుణమాఫీ 4,5 విడతల బకాయిలు అనంతరం వచ్చిన జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం చెల్లించలేదు. నూతన తెలుగుదేశ ప్రభుత్వం 4,5 విడుతల రుణమాఫీ నిధులను విడుదల చేసే ఆలోచన చేయాలి.
(16) రైతులు, కౌలు రైతుల సాగు సాయం ఎకరాకు రూ॥ 15,000 ఇవ్వాలి. రాష్ట్రంలో అవ్వుల భారీన పడిన రైతు, కౌలు అన్ని రకాల పంట రుణాలు రద్దు చేయాలి.
(17) ప్రకృతి వ్యవసాయంలో గౌరవ వేతనం పొందే కార్యకర్తల వేతన బకాయలను వెంటనే చెల్లించాలి.
(18) ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయరంగానికి అనుసంధానం చేయాలి.
(19) నేషనల్ డ్యామ్ స్టేఫ్టీ కమిటీ నిర్ధారణ మేరకు శ్రీశైలం ప్రాజెక్టు దిగువభాగంలో పడిన లోతైన గుంటను పూడ్చి డ్యామ్ రక్షణ చర్యలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపి రైతుసంఘము సింగనమల నియోజకవర్గం అధ్యక్షులు మధు యాదవ్, చేనేత కమిటీ మండల కార్యదర్శి చేనేత మధు, రైతు సంఘం సింగనమల మండల కార్యదర్శి కొండపల్లి చంద్రశేఖర్, రైతు సంఘం నాయకులు నాగబయన్న, కోనప్ప, కుళ్లాయప్ప, విజయ్, చెన్నప్ప, తదితరులు పాల్గొన్నారు.