ఈవీఎం గోదాములను తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీ

0

ఈవీఎం గోదాములను తనిఖీ  చేసిన జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీ


BSBNEWS - ONGOLE

ప్రకాశంజిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారీ ఒంగోలు నగరంలో గల మామిడిపాలెం వద్దనున్న ఈవీఎం గోదాములను తనిఖీ చేశారు. త్రైమాసిక తనిఖీలలో భాగంగా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో ఈవిఎం గోదాము షట్టర్లకు వేసిన సీలును ఓపెన్ చేసి లోపలి పరిస్థితిని పరిశీలించారు. ఇటీవల జరిగిన సాధారణ ఎన్నికల్లో వినియోగించని నాన్ పోల్డ్ ఈవీఎంల పరిస్థితిని ఆమె ప్రత్యక్షంగా చూసి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నాన్ పోల్డ్ ఈవీఎంలు 1600 ఇక్కడ భద్రపరిచినట్లు అధికారులు ఆమెకు వివరించారు. ఈవీఎంల పరిస్థితి, ఇక్కడ కల్పిస్తున్న భద్రత, సీసీటీవీ ల ద్వారా పర్యవేక్షిస్తున్న విధానంపై ఆమె సంతృప్తి వ్యక్తం చేశారు. వీటికి సంబంధించిన నివేదికను ఎన్నికల సంఘానికి పంపుతామని ఆమె తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంట ఇంచార్జి డిఆర్ఓ విశ్వేశ్వరరావు, రాజకీయ పార్టీల ప్రతినిధులు కాలేషా, రాజశేఖర్, రసూల్, సుదర్శనరావు, సయ్యద్ హనీఫ్ తో పాటు జిల్లా ఎన్నికల విభాగ సూపరింటెండెంట్ శ్రీనివాసరావులు ఉన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)