అంకమ్మ తల్లి కి మొక్కు తీర్చుకున్న పివిఆర్

bsbnews
0

 అంకమ్మ తల్లి కి మొక్కు తీర్చుకున్న పివిఆర్



BSBNEWS - KANDUKUR

 

అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థి ఇంటూరి నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా గెలుపొందిన  సందర్భంగా సూర్య బార్ అధినేత, టిడిపి నాయకులు పట్టణంలోని అంకమ్మ తల్లి ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు పిడికిడి వెంకటేశ్వర్లు శుక్రవారం  అంకమ్మ తల్లికి అభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా పిడికిటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఇంటూరి నాగేశ్వరరావు కందుకూరు నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలవాలని గత ఐదు వారాల నుంచి అంకమ్మ తల్లి ఆలయంలో అమ్మవారికి అభిషేకం నిర్వహిస్తున్నామని అన్నారు. నాగేశ్వరరావు ఎమ్మెల్యేగా గెలిచిన సందర్భంగా నేడు అంకమ్మ తల్లి అమ్మవారికి అభిషేకం నిర్వహించి అమ్మవారికి  మొక్కు చెల్లించుకున్నామని తెలిపారు. ఎంతో మహిమ గల అంకమ్మ తల్లి  ఆశీస్సులతో ఎమ్మెల్యేగా ఇంటూరి నాగేశ్వరరావు గెలిచారని అన్నారు. అంకమ్మ తల్లి అనుగ్రహంతో కందుకూరు నియోజకవర్గ ప్రజలకు మంచి పరిపాలన అందించాలని ఆయన ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పివిఆర్ కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments
Post a Comment (0)