మాలకొండకు పాదయాత్రగా తరలివెళ్లిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు
BSBNEWS - KANDUKUR
కందుకూరు ఎమ్మెల్యేగా ఇంటూరి నాగేశ్వరరావు ఘనవిజయం సాధించిన సందర్భంగా ఆయన సతీమణి సౌజన్య ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, INR అభిమానులు శుక్రవారం మాలకొండకు పాదయాత్ర చేపట్టారు. ఎమ్మెల్యే స్వగ్రామం వలేటివారిపాలెం మండలం బడేవారిపాలెం నుంచి ఈ మధ్యాహ్నం పాదయాత్ర మొదలుపెట్టారు. ఎమ్మెల్యే సతీమణి సౌజన్య , కుమారులు అవినాష్, సందీప్ కూడా పాదయాత్రలో పాల్గొన్నారు. వీరంతా రాత్రికి మాలకొండ పైకి చేరుకుంటారు. ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు , పాదయాత్ర చేసిన వారు కలిసి, శనివారం ఉదయాన్నే శ్రీ మాల్యాద్రి లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకుంటారు. పాదయాత్ర సందర్భంగా బడేవారిపాలెం, ఎస్సీ కాలనీలో ప్రజలు హారతులు పట్టారు. అక్కడే డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ విగ్రహానికి సౌజన్య, ఇతర నాయకులు పూలమాలవేసి నివాళులర్పించారు. వలేటివారిపాలెం మండల పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం, కందుకూరు పట్టణ పార్టీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, గుడ్లూరు మండల పార్టీ అధ్యక్షులు జనిగర్ల నాగరాజు, పెద్ద ఎత్తున మహిళలు యాత్రలో నడుస్తున్నారు.