నా బిడ్డను కాపాడండి

0

నా బిడ్డను కాపాడండి
  

BSBNEWS - KANDUKUR


కందుకూరు పట్టణంలోని పోతురాజు మిట్ట ప్రాంతంలో నివాసం ఉంటున్న షేక్ ఆరిఫ్ తన మూడేళ్ల కుమారుడు లివర్ సమస్యతో ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడని ఆ బిడ్డను కాపాడండి అంటూ కన్నీటిపర్యంతమైన సంఘటన పలువురిని కదిలిస్తుంది. తన కుమారుడిని కాపాడుకునేందుకు విజయవాడలో ప్రైవేటు వైద్యశాలలో చికిత్స చేయిస్తున్నారు. అయితే కుమారుడి వైద్యం నిమిత్తం దాదాపు 15 లక్షల వరకు ఖర్చు అవుతుందని వైద్యులు తెలపడం తో దొరికిన చోటల్లా అప్పు చేసి ఐదు లక్షల వరకు పోగు చేసుకొని ఖర్చు పెట్టారు. మిగిలిన డబ్బుల కోసం దాతల సహాయం కోరుతూ వాట్సాప్ సోషల్ మీడియా లో చేసిన పోస్టులు అందరిని కదిలించింది. దాంతో ఎవరికీ చేతనయినంతగా 500 రూపాయలు నుండి వేల సంఖ్యలో దాతలు సహాయం చేస్తున్నారు. అయినా తన కుమారుడు కాపాడుకోవడం కోసం ఆ తల్లిదండ్రులు చేయని ప్రయత్నాలు లేవు. మనసున్న మారాజులు ఎవరైనా తమ సమస్యను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి తన బిడ్డను కాపాడాలని ప్రయత్నం మరింతగా తన సన్నిహితులు తెలిసిన వ్యక్తుల ద్వారా చేరుతుందని ఆశతో ఉన్నారు. ప్రతి ఒక్కరు ఆ చిన్నారిని ఆదుకునేందుకు చేస్తున్న ప్రయత్నం సఫలం కావాలని విషయం తెలిసిన అందరూ కోరుకుంటున్నారు.


Post a Comment

0Comments
Post a Comment (0)