జిల్లా కలెక్టర్ ను కలిసిన బహుజన సమాజ్ పార్టీ నాయకులు
BSBNEWS - ONGOLE
బహుజన సమాజ్ పార్టీ (బి.యస్.పి) ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా నూతన కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియాను కలిసి పూలమోక్కతో శుభాకాంక్షలు తెలియజేశారు. జిల్లా కలెక్టర్లను కలిసిన వారిలో బి.యస్.పి జిల్లా అధ్యక్షులు తాటిపర్తి వెంకటస్వామి, ధరణికొట లక్ష్మి నారాయణ, మాస్ ఆర్గనైజేషన్ అధ్యక్షులు జి. శివాజీ, బి.యస్.పి.రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పేరం సత్యం, బి.యస్.పి.జిల్లా ఇంచార్జి ఆర్ రాజశేఖర్,ఒంగోలు బి.యస్.పి.అధ్యక్షులు దాసు, రాజారావు తదితరులు ఉన్నారు