అక్షర యోధుఢు రామోజీరావుకు సంతాపం తెలిపిన ఏపీడబ్ల్యూజే
BSBNEWS - KANDUKUR
అక్షర యోధుఢు, తెలుగుజాతిని తిమిరం నుంచి అభ్యుదయం వైపు నడిపించిన దార్శనికుడు , జనాన్ని జాగృతం చేయటమే లక్ష్యంగా అన్యాయంపై తుదిశ్వాస వరకు రాజీలేకుండా పోరాడిన ఈనాడు గ్రూపు సంస్థల అధినేత రామోజీరావు మృతికి ఏపీయూడబ్ల్యూజె కందుకూరు శాఖ సమితి నాయకులు శనివారం సంతాపం తెలిపారు. స్థానిక పోస్టాఫీసు సెంటర్ లోని బి.ఎస్.బి న్యూస్ కార్యాలయంలో ఏపీడబ్ల్యూజే కందుకూరు శాఖ అధ్యక్షులు కొల్లూరి హరిబాబు, ప్రధాన కార్యదర్శి కిస్టాఫర్ ఆధ్వర్యంలో రామోజీరావుకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న ఏపీడబ్ల్యూజే ఉమ్మడి ప్రకాశం జిల్లా ఉపాధ్యక్షుడు గాండ్ల శ్రీనివాసులు మాట్లాడుతూ ఈనాడు అధినేత ప్రముఖ పారిశ్రామికవేత్త రామోజీరావు అస్తమించినా ఆయన భావాలు నిత్యం ఉదయిస్తూ ఆయన మన మధ్య సజీవంగా ఉంటాడని అన్నారు. ప్రతి కలంలో ఆయన ఆశయం బతికే ఉంటుందని ఆయన తెలిపారు. ఆయన పవిత్రాత్మ కు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబ సభ్యులకు సంతాపం తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఐజేయు మెంబర్ ఉప్పుటూరు మాధవరావు, ఏపీడబ్ల్యూజే సభ్యులు ద్రోణాదుల అశోక్, నాగభూషణం, బూసి సురేష్ బాబు, మహేంద్ర, వెంకట్, ఎర్రంశెట్టి ఆనందమోహన్, ద్రోణాదుల సురేష్, శివ, రాజా, గుండెమడుగుల మోజేష్, కృష్ణ బాబు, వంశి, కంచర్ల మల్లికార్జున, యాసిన్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.