కందుకూరు ప్రజల అభిమానం ఎన్నటికీ మర్చిపోను - ఎమ్మెల్యే నాగేశ్వరరావు

0

కందుకూరు ప్రజల అభిమానం ఎన్నటికీ మర్చిపోను


 24 గంటలూ మీ సేవకు సిద్ధం - ఇంటూరి నాగేశ్వరరావు


 ఎమ్మెల్యేకు శ్రీరామ్ నగర్ కాలనీ వాసుల ఆత్మీయ సత్కారం


 ర్యాలీ, సన్మానానికి భారీగా తరలివచ్చిన టిడిపి శ్రేణులు 

BSBNEWS - కందుకూరు




కందుకూరు పట్టణంలోని చుట్టుగుంట రోడ్డులోగల శ్రీరామ్ నగర్ కాలనీవాసులు, కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావుపై అంతులేని అభిమానాన్ని కురిపించారు. ఎమ్మెల్యేగా ఘనవిజయం పట్ల అభినందనలు తెలియజేస్తూ, శ్రీరామ్ నగర్ కాలనీకి చెందిన స్థానిక నాయకుడు తలతోటి మస్తాన్ ఆధ్వర్యంలో శుక్రవారం భారీ ఎత్తున సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముందుగా పోతురాజుమిట్ట దగ్గర నుంచి కాలనీ వరకు ర్యాలీ నిర్వహించి అనంతరం ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావును ఘనంగా సన్మానించారు. ఈ వేడుకలో పార్టీ శ్రేణులు, అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. సన్మానం అనంతరం ఎమ్మెల్యే నాగేశ్వరరావు మాట్లాడుతూ ఈ మధ్య జరిగిన ఎన్నికల్లో కందుకూరు పట్టణ ప్రజలు తనపై చూపిన అభిమానం, ప్రేమ ఎన్నటికీ మరిచిపోనని చెప్పారు. కందుకూరు నియోజకవర్గ చరిత్రలో ఎన్నడూ లేనంత మెజారిటీ తనకు అందించారని కృతజ్ఞతలు తెలిపారు. ముఖ్యంగా కందుకూరు పట్టణంలో గత రికార్డులను బద్దలు కొట్టి 7 వేలకు పైగా ఓట్ల ఆధిక్యత ఇచ్చిన పట్టణ ప్రజలందరికీ రుణపడి ఉంటానన్నారు. పట్టణ పరిధిలోని యువకులు, మహిళలు, ప్రభుత్వ ఉద్యోగులు, విద్యావంతులు భవిష్యత్తు గురించి ఆలోచించి తెలుగుదేశం పార్టీకి మద్దతు పలికారని, వారందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. మున్సిపాలిటీ పరిధిలో సమస్యలన్నిటిని ఒక్కొక్కటిగా పరిష్కరించేందుకు ఇప్పటికే ప్రణాళికలు సిద్ధం చేశామని, ఈ ఐదేళ్లలో కందుకూరు రూపురేఖలు మారబోతున్నాయని తెలిపారు. పట్టణంలో శాంతిభద్రతలు కాపాడాల్సిన బాధ్యత తనపై ఉందని, ఏ ఒక్కరికి కూడా ఎలాంటి హాని జరగకుండా, చెడు సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటామని మరొక్కసారి ఎమ్మెల్యే నాగేశ్వరరావు స్పష్టం చేశారు.  ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్షులు దామా మల్లేశ్వరరావు, మాజీ అధ్యక్షుడు పిడికిటి వెంకటేశ్వర్లు, వార్డు అధ్యక్షులు కోటపూరి శ్రీను, పార్టీ నాయకులు కండ్రా మాల్యాద్రి, చిలకపాటి మధు, బెజవాడ ప్రసాద్, షేక్ రఫీ, వడ్డేళ్ళ రవిచంద్ర, ముచ్చు శ్రీను, షేక్ సలాం, సవిడి బోయిన వెంకటకృష్ణ, చీదెళ్ల వేణుగోపాల్, సురేష్ రెడ్డి, పులి నాగరాజు, వార్డు నాయకులు రామకోటేశ్వరరావు, మామిడి మాల్యాద్రి, ఏచూరి మాల్యాద్రి, గుమ్మడి మాల్యాద్రి, బూసి సురేష్, నవీన్, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. 

Post a Comment

0Comments
Post a Comment (0)