హ్యాట్రిక్ ఎమ్మెల్యే స్వామికి*దామచర్ల సత్యకి శుభాకాంక్షలు
టిడిపి, జె ఎస్ పి, బిజెపి నాయకులకు, కార్యకర్తలకు అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు
రేపు పవన్ కళ్యాణ్ గారిని కలవడం జరుగుతుంది
BSBNEWS - KONDEPI
ప్రకాశం జిల్లాలో కొండపి నియోజకవర్గంలో కూటమి అభ్యర్థి డోల బాల వీరాంజనేయ స్వామిని అత్యధిక మెజార్టీతో గెలిపించిన కొండపి నియోజకవర్గం టిడిపి, జె ఎస్ పి, బిజెపి మూడు పార్టీల నాయకులు, అభిమానులు, కార్యకర్తలు ప్రజలందరికీ ప్రత్యేకంగా జనసేన పార్టీ నుండి కొండేపి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త కనపర్తి మనోజ్ కుమార్ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా గతంలో పవన్ కళ్యాణ్ ని కలిసిన సందర్భంలో కొండపి నియోజకవర్గంలో ఎమ్మెల్యే స్వామిని అత్యధిక మెజార్టీతో గెలిపించుకుని మీ ముందుకు వస్తాను అని పవన్ కళ్యాణ్ గాకి నేను మాట ఇవ్వడం జరిగింది అని, నేడు ప్రజలందరూ కూటమి అభ్యర్థిని అత్యధిక మెజార్టీతో గెలిపించడం జరిగింది అని, ముఖ్యంగా జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఎమ్మెల్యే స్వామి గెలుపులో కీలకపాత్ర పోషించారన్నారు. రేపు పవన్ కళ్యాణ్ ని కలిసి ఎమ్మెల్యే స్వామి విజయానికి సంబంధించిన అన్ని విషయాలను క్లుప్తంగా నేను వివరించి తెలియజేయడం జరుగుతుంది అని అన్నారు. గతంలో కంటే ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొండపి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు ఎక్కువగా జరుగుతాయని, ప్రజలందరికీ ఇచ్చిన హామీలు కచ్చితంగా నెరవేరుస్తామన్నారు. కూటమి ప్రభుత్వం మనందరి ప్రభుత్వం అని, ప్రతి పేదవాడి ప్రభుత్వం అని, కొండపి నియోజకవర్గం లో ప్రజలందరికీ ఎటువంటి సమస్య వచ్చిన స్వతంత్రంగా వచ్చి వివరంగా తెలిపి మీ యొక్క సమస్యలకు పరిష్కార మార్గాలు కూడా కూటమి ప్రభుత్వంలో లభిస్తాయన్నారు. ముఖ్యంగా జనసేన నాయకులందరికీ బాధ్యత పెరిగింది అని, నియోజకవర్గంలో ప్రజలకు ఎటువంటి సమస్య వచ్చిన 9848160828 నెంబర్ కి ఫోన్ చేయవచ్చని తెలిపారు. ప్రజలందరికీ నేను అందుబాటులో ఉంటాను అని తెలియజేశారు.