మంత్రులు రవీంద్రకి,అనితకి శుభాకాంక్షలు తెలిపిన కందుకూరు టిడిపి పట్టణ కార్యదర్శి ముచ్చు శ్రీను
BSBNEWS - KANDUKUR
ఎన్డీఏ కూటమిలో తెలుగుదేశం పార్టీ నుండి రాష్ట్ర మంత్రులుగా ఎన్నికైన కొల్లు రవీంద్ర , వంగలపూడి అనితకి కందుకూరు పట్టణ టిడిపి కార్యదర్శి ముచ్చు శ్రీను ఓ ప్రకటనలో శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలో మంత్రులకు శాఖల కేటాయింపులో టీడీపీ నేత కొల్లు రవీంద్రకి ఎక్సైజ్, గనులు, జియాలజీ శాఖ మంత్రిగా, ప్రతిష్టాత్మకమైన హోం శాఖ మంత్రిగా వంగలపూడి అనితకి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేటాయించడంతో ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మంత్రులుగా వీరు ప్రజల మన్ననలు పొందేలా సేవలు అందించాలని ఆయన కోరారు. టిడిపిలో కష్టపడి పనిచేసిన ఎవరికైనా ఉన్నత స్థానాలు దక్కుతాయని అన్నారు. హోంశాఖ మంత్రిగా ఓ మహిళకు కేటాయించడం శుభపరిణాయమని అన్నారు. నూతన మంత్రులుగా ఎన్నికైన వారికి ,వారి కేటాయించిన శాఖలకు న్యాయం చేసేలా విధులు నిర్వహించాలని కోరారు.